By: ABP Desam | Updated at : 08 May 2023 07:32 PM (IST)
టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు (Image Credits: PBKS Twitter)
Kolkata Knight Riders vs Punjab Kings: ఐపీఎల్ 2023 సీజన్ 53వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) మొదట బౌలింగ్ చేయనుంది.
వరుసగా అన్ని మ్యాచ్‌ల్లోనూ 200కు పైగా కొడుతున్నామని, అది చాలా మంచి విషయం అని శిఖర్ ధావన్ టాస్ గెలిచాక చెప్పాడు. పంజాబ్ కింగ్స్ తన జట్టులో ఒక మార్పు కూడా చేసింది. మాథ్యూ షార్ట్ స్థానంలో శ్రీలంక విధ్వంసకర ఆటగాడు భానుక రాజపక్సను జట్టులోకి తీసుకుంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం ఏ మార్పులూ చేయలేదు.
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిదో స్థానంలోనూ, పంజాబ్ కింగ్స్ ఏడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరనుంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తే ఐదో స్థానానికి చేరనుంది. భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకుంటే నాలుగో స్థానానికి కూడా చేరుకునే అవకాశం ఉంది.
🚨 Toss Update 🚨@PunjabKingsIPL have elected to bat against @KKRiders at Eden Gardens.
Follow the match ▶️ https://t.co/OaRtNpAfXD#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/BBRAIQXvrL— IndianPremierLeague (@IPL) May 8, 2023
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నాథన్ ఎల్లిస్, సికందర్ రాజా, అథర్వ తైడే, మోహిత్ రాథీ, మాథ్యూ షార్ట్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అనుకూల్ రాయ్, నారాయణ్ జగదీషన్, జేసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, కుల్వంత్ ఖేజ్రోలియా
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో రెండోసారి ఆడనుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో కోల్‌కతా ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. నితీశ్ రాణా కెప్టెన్సీలో ఆ జట్టు తొలి 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది. ఇక్కడి నుంచి ఆ జట్టు తర్వాతి 4 మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించిన కేకేఆర్ ప్లేఆఫ్ రేసులో నిలిచింది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ ప్రయాణం గురించి చెప్పాలంటే వారు వరుసగా రెండు విజయాలతో సీజన్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది, 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.
కేకేఆర్, పంజాబ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే కోల్‌కతా పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కేకేఆర్ 20 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది.
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- హడలిపోయిన అధికారయంత్రాంగం!
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?