అన్వేషించండి

ipl rajasthan vs lucknow records : రాజ‌స్థాన్ ల‌క్నో టీం రికార్డ్‌లు

ipl rajasthan vs lucknow records in ipl history: ఐపీయ‌ల్ లో రాజ‌స్థాన్ ల‌క్నో టీం రికార్డ్‌లు ఓసారి పరిశీలిస్తే.

Rajasthan Vs Lucknow: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి అంటే బ‌ల‌మైన టీంల మ‌ధ్య పోరు అని అర్ధం. ఐపీయ‌ల్ లో త‌లప‌డింది త‌క్కువే అయినా టైటిల్ ఫేవ‌రెట్ల మ‌ధ్య పోరుగానే భావిస్తారు అభిమానులు. ఇక ఈ సారి రాహుల్ సార‌థ్యంలోని ల‌క్నో... టైటిల్‌కోసం ఎలా పోరాడుతుందో... సంజూశాంస‌న్ కూడా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కి క‌ప్ అందివ్వాల‌ని అలాగే  ఉవ్విళ్లూరుతున్నాడు. 2022లో మిస్ అయ్యిన అవ‌కాశాన్ని ఈ సారి వ‌దులుకోకూడ‌ద‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. మ‌రి ఆదివారం త‌ల‌ప‌డ‌బోతున్న ఈ టీమ్‌ల మ‌ధ్య ఐపీయ‌ల్ లో గ‌ణాంకాలు ఎలా ఉన్నాయి ఎవ‌రికి ఎక్కువ అకాశాలున్నాయి ఈ క‌థ‌నంలో చూద్దాం. 

ఈ మ్యాచ్ గుర్తుందా
ముందుగా 2022లో వీళ్లిద్దిరి మ‌ధ్య జ‌రిగిన ఒక మ్యాచ్ గురించి చెప్పుకోవాలి. ముంబ‌య్‌లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ 6 వికెట్లు కోల్పోయి 165 ప‌రుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మేయ‌ర్ 59 ప‌రుగుల‌తో టాప్‌స్కోర‌ర్‌గా నిలిచారు. బ్యాటింగ్‌కి అనుకూలించే పిచ్ పైన ఈ లక్ష్యం స‌రిపోదు అనుకున్నారు అంతా. కానీ య‌జువేంద్ర చాహ‌ల్ స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీసాడు. దీంతో ల‌క్నో 3 ప‌రుగుల‌తో పోరాడి ఓడిపోయింది. ఇలాంటి ఉత్కంఠ‌భ‌రితంగానే ఉంటుంది ఇద్దరి మ‌ధ్య మ్యాచ్‌. అందుకే ఫ్యాన్స్ కూడా వీళ్ల మ‌ధ్య పోరు అంటే యుద్ధ‌మే అనుకొంటుంటారు.

రికార్డ్ ఏంటి
ఇక ఐపీయ‌ల్లో ఈ రెండు టీమ్‌ల మ‌ధ్య  3 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 2 మ్యాచ్‌లు గెల‌వ‌గా, ల‌క్నో ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఇక మ్యాచ్ జ‌రిగే స‌వాయ్ మాన్‌సింగ్ మైదానంలో రాజ‌స్థాన్ కి మెరుగైన రికార్డే ఉంది. 52 మ్యాచ్‌ల్లో పాల్గొన్న రాజ‌స్థాన్ 33 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. 19 మ్యాచ్‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. ఇక ల‌క్నో ఈ గ్రౌండ్‌లో ఒక్క మ్యాచ్  ఆడ‌గా అందులో విజ‌యం సాధించింది. ఇక వీళ్లిద్ద‌రికి మ‌ధ్య జ‌రిగిన పోరులో రాజ‌స్థాన్‌, ల‌క్నో చెరో మ్యాచ్ విజ‌యం సాధించారు. ఇక ఈ మైదానంలో అత్య‌ధిక స్కోరు 154 ప‌రుగులు కాగా, అత్య‌ల్ప స్కోరు 144 ప‌రుగులుగా ఉంది.

ఈ ఆట‌గాళ్ల పోరు చూడాల్సిందే
ఇక రెండు టీమ్‌ల్లో ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు ఎలా ఉండ‌నుంది అంటే...ల‌క్నో విధ్వంస ఓపెన‌ర్  క్వింట‌న్ డికాక్ వ‌ర్సెస్ సందీప్ శ‌ర్మ గా ఉంటుంది. సందీప్  6 ఇన్నింగ్స్‌ల్లో డికాక్‌ని 2 సార్లు ఔట్ చేశాడు  43 ప‌రుగులుమాత్ర‌మే ఇచ్చాడు.ఈ మ్యాచ్‌లో ప‌వ‌ర్ ప్లేలో వీళ్లిద్ద‌రి మ‌ధ్య‌ ఆస‌క్తిక‌ర స‌మ‌రం ఉండ‌నుంది. త‌ర్వాత మిడిల్ ఆర్డ‌ర్‌లో రాబోతున్న‌ కేయ‌ల్ రాహుల్ కి చాహ‌ల్, అశ్విన్ ల మ‌ధ్య పోరు ఉంటుంది. మిడిలార్డ‌ర్ లో ఇది మ‌రో ఆస‌క్తిక‌ర అంశం గా చెప్పొచ్చు. రాహుల్ స్పిన్ బౌలింగ్ ని బాగా ఆడ‌గ‌ల‌డు. కానీ వీళ్లిద్ద‌రూ రాహుల్ కి స‌వాల్ విస‌ర‌గ‌ల‌రు. ఇక భీక‌ర ఫాంలో ఉన్న య‌శ‌స్వి జెశ్వాల్ కి మార్క‌స్ స్టొయిన‌స్ అడ్డుగా నిల‌బ‌డ‌బోతున్నాడు. జైశ్వాల్ ని ఇప్ప‌టి వ‌ర‌కు 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సార్లు ఔట్ చేశాడు స్టొయిన‌స్‌. 

దీంతో ఈ ఆట‌గాళ్ల పోరు అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నుంది. అలాగే ఈ ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న బట్టి జ‌ట్టు విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక ఈ రెండు టీమ్‌ల మ‌ధ్య‌ ఎక్కువ ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల లో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ 94 ప‌రుగుల‌తో టాప్‌లో ఉండ‌గా... దీప‌క్‌హుడా, మార్క‌స్ స్టొయిన‌స్ 86 ప‌రుగుల‌తో త‌ర్వాతిస్థానాల్లో ఉన్నారు. అలాగే బౌల్ట్‌, ఆవేశ్‌ ఖాన్‌, చాహ‌ల్ లు 5 వికెట్లు తీసి ఎక్కువ వికెట్లు తీసిన వారిగా నిలిచారు. 

ల‌క్నో,రాజ‌స్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డింది త‌క్కువ మ్యాచ్‌లే అయినా వీరి మ‌ధ్య పోరు చివ‌రి బాల్ వ‌ర‌కు వెళ్తుంది. ఓట‌మిని అంత తేలిగ్గా ఒప్పుకోరు. కాబ‌ట్టి ఈ మ్యాచ్‌కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. మ‌రి రాజ‌స్‌థాన్‌, ల‌క్నోజ‌ట్లు త‌మ మొద‌టిమ్యాచ్‌లో గెలిచి ఎవ‌రు టోర్న‌మెంట్‌లో ముంద‌డుగు వేస్తారో మ‌రికాసేపట్లోతేలిపోనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget