అన్వేషించండి

Lalit Modi Interview:"నేను, మోదీ చాలా క్లోజ్‌, త్వరలోనే భారత్‌ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్

Lalit Modi Interview:లలిత్ మోడీ భారత్‌ తిరిగి వస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తూ, "నా స్నేహితుల్లో చాలా మంది అధికారంలో ఉన్నారు..." అని అన్నారు. మోదీ తనకు చాలా క్లోజ్‌ అని చెప్పారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • లలిత్ మోడీ తాను పారిపోలేదని, భారత న్యాయ ప్రక్రియను ప్రశ్నించారు.
  • ఐపీఎల్ తన బిడ్డని, మోదీతో క్రికెట్ చర్చలు మాత్రమేనని తెలిపారు.
  • మోదీ స్టేడియం పునర్నిర్మాణంపై, ప్రపంచస్థాయి మౌలిక వసతుల ఆకాంక్ష వెలిబుచ్చారు.

Lalit Modi Interview:పరారీలో ఉన్న లలిత్ మోడీ, భారత్‌కు తిరిగి రావడం, చట్టపరమైన విషయాల గురించి కూడా ఏఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "నేను పారిపోవడం లేదు. ఈ రోజు నా స్నేహితులలో చాలా మంది అధికారంలో ఉన్నారని చెప్పాను, కానీ నేను సహాయం కోసం ఎవరికీ ఎప్పుడూ ఫోన్ చేయలేదు" అని అన్నారు. నేను మోదీ చాలా క్లోజ్‌గా ఉండే వాళ్లమని ఎప్పుడూ క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకునే వాళ్లమని వివరించారు. 

ఐపీఎల్ మాజీ ఛైర్మన్, పరారీలో ఉన్న లలిత్ మోడీ, భారతదేశానికి తిరిగి రావడం, చట్టపరమైన విషయాలతో సహా పలు అంశాలపై ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనపై బలమైన కేసు ఉంటే, తాను కోర్టుకు వెళ్లేవాడినని పేర్కొన్నారు. లలిత్ మోడీ భారత న్యాయ ప్రక్రియను కూడా ప్రశ్నించారు. "నేను ఏ చట్టం నుంచీ పారిపోవడం లేదు. నాపై పక్కా కేసు ఉండి ఉంటే, అది 17 ఏళ్లలోపే కోర్టుకు చేరి ఉండేది." ఇప్పటి వరకు తనపై ఎలాంటి క్రిమినల్ శిక్ష పడలేదని ఆయన పేర్కొన్నారు. "నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, చర్య తీసుకుని ఉండేవారు."

పరారీలో ఉన్న లలిత్ మోడీ తన సమస్య భారత ప్రభుత్వంతో కాదని, న్యాయ ప్రక్రియలోని నెమ్మదితోనే ఉందని పేర్కొన్నారు. చాలా కేసుల్లో నిజం బయటపడటానికి సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నాడు. నెమ్మదైన న్యాయ ప్రక్రియే ఒక శిక్షగా మారుతుందని అన్నారు. 

ఐపీఎల్ నా బిడ్డ వంటిది 

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఐపీఎల్ గురించి మాట్లాడుతూ, "వ్యవస్థ అంగీకరించినా, అంగీకరించకపోయినా, నేను ఈ ఆటను, లీగ్‌ను చాలా నిశితంగా చూస్తున్నాను." "ఈ రోజు నా ప్రాధాన్యత నా కుటుంబం, నా పిల్లలే. నా వల్ల, వారు ఊహించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఐపీఎల్ కూడా నాకు బిడ్డతో సమానం" అని అన్నారు. 

అధికార పార్టీతో తనకున్న సాన్నిహిత్యం గురించి లలిత్ మోదీ మాట్లాడుతూ, "ఈ రోజు నా స్నేహితుల్లో చాలా మంది అధికారంలో ఉన్నారు, కానీ నేను సహాయం కోసం ఎవరికీ ఫోన్ చేయలేదు. 17 ఏళ్లలో, నా స్వలాభం కోసం నేను ఏ రాజకీయ సంబంధాలను ఉపయోగించుకోలేదు." అని అన్నారు. "నేను కోరుకుంటే చాలా మందికి ఫోన్ చేసి ఉండొచ్చు, కానీ నేను ఎవరినీ సహాయం అడగలేదు." అని తెలిపారు.

Also Read: ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో న‌యా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గొప్ప క్రికెట్ అభిమానిగా మాజీ ఐపీఎల్ ఛైర్మన్,క్రికెట్ నిర్వాహకుడు లలిత్ మోడీ అభివర్ణించారు. తనకు, ప్రధాని మోదీకి మధ్య జరిగే చర్చల్లో ఎక్కువ భాగం అహ్మదాబాద్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఉండేవని అన్నారు. గుజరాత్‌లో క్రికెట్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవారని చెప్పారు.

"మా సంభాషణలు కేవలం క్రికెట్ గురించే ఉండేవి," అని లలిత్ మోడీ అన్నారు, "నరేంద్ర మోదీ క్రికెట్ అభిమాని. ఆయనకు అహ్మదాబాద్‌లోని క్రికెట్ మౌలిక సదుపాయాలపై ఆసక్తి ఉండేది, మా చర్చలు క్రికెట్‌కే పరిమితమయ్యాయి." "నేను నరేంద్ర మోదీకి సన్నిహితంగా ఉండేవాడిని, కానీ ఆ సాన్నిహిత్యం క్రికెట్ విషయంలోనే కానీ రాజకీయాల విషయంలో కాదు." అని స్పష్టం చేశారు. 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం గురించి ఇటీవల చేసిన ప్రకటనల తర్వాత లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు . అవకాశం ఇస్తే, ప్రేక్షకులకు మెరుగైన వీక్షణా అనుభవాన్ని అందించడానికి ఆ స్టేడియంను కూల్చివేసి తిరిగి నిర్మిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియంలలో ఒకటిగా పరిగణించే ఈ మైదానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

'నేను స్టేడియంను విమర్శించలేదు'

తాను స్టేడియంను విమర్శించలేదని, భారత క్రీడా మౌలిక సదుపాయాల కోసం ఒక పెద్ద దార్శనికత గురించి మాట్లాడుతున్నానని లలిత్‌ మోడీ అన్నారు. "ఈ రోజు ఇది భారత్‌లోనే అత్యుత్తమ స్టేడియం, కానీ అది సరిపోదు. నేను దానిని కూల్చివేస్తానని చెప్పాను. నేను దానిని కూల్చివేయడం గురించి మాట్లాడితే, ఇతర స్టేడియంలను కూడా కూల్చివేయాల్సి వస్తుంది. ఈ రోజు ఇది భారత్‌లోనే అత్యుత్తమ స్టేడియం అని నేను స్పష్టంగా చెప్పాను. కానీ నేను అంతర్జాతీయ స్థాయి అభిమానుల అనుభవాన్ని అందించాలనుకుంటే, నేను దానిని కూడా పునర్నిర్మిస్తాను." అని పేర్కొన్నారు. 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి నేడు ఉన్న ఆర్థిక శక్తి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా మైదానాలకు దీటుగా దేశంలో స్టేడియాలను నిర్మించాలని లలిత్‌ అన్నారు. "ఈ రోజు వెంబ్లీ స్టేడియం, లార్డ్స్, బార్సిలోనా క్యాంప్ నౌ, మాంచెస్టర్ యునైటెడ్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ సిటీ ఎతిహాద్ స్టేడియంలను చూడండి. అవన్నీ మన స్టేడియాల కంటే ఎంతో ఉత్తమమైనవి. ఈ రోజు బీసీసీఐ వద్ద గతంలో కంటే ఎక్కువ డబ్బు ఉంది, కాబట్టి మనం మరింత పెద్ద స్థాయిలో ఆలోచించాలి." అని సూచించారు. 

Frequently Asked Questions

లలిత్ మోడీ తాను పారిపోతున్నానని ఒప్పుకుంటున్నారా?

కాదు, తాను పారిపోవడం లేదని లలిత్ మోడీ పేర్కొన్నారు. తనపై బలమైన కేసు ఉంటే, 17 ఏళ్లలోనే కోర్టుకు వెళ్లేవాడినని ఆయన అన్నారు.

భారత న్యాయ ప్రక్రియపై లలిత్ మోడీ అభిప్రాయం ఏమిటి?

భారత న్యాయ ప్రక్రియ నెమ్మదిగా ఉందని, అదే తన సమస్య అని లలిత్ మోడీ అన్నారు. నెమ్మదైన న్యాయమే శిక్షగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

లలిత్ మోడీకి ఐపీఎల్ అంటే ఎంత ముఖ్యం?

ఐపీఎల్ తన బిడ్డతో సమానమని లలిత్ మోడీ అన్నారు. ఈ లీగ్‌ను తాను చాలా నిశితంగా చూస్తున్నానని ఆయన తెలిపారు.

లలిత్ మోడీ, ప్రధాని మోదీల మధ్య సంభాషణలు దేని గురించి ఉండేవి?

వారి మధ్య జరిగే సంభాషణలు అహ్మదాబాద్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మాత్రమే ఉండేవని లలిత్ మోడీ వివరించారు. ప్రధాని మోదీ క్రికెట్ అభిమాని అని ఆయన చెప్పారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget