Andre Russell Retirement: ఐపీఎల్‌కు ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్.. మెరుపు ఇన్నింగ్స్‌లు చూడలేం
Russell Retirement: ఆండ్రే రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. KKR రస్సెల్‌ను రిటైన్ చేసుకోలేదు. దాంతో 2026 వేలానికి ముందు రస్సెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Russell Retires from IPL: పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ IPL కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. 2014 నుండి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడుతున్న ఆండ్రీ రస్సెల్‌ను రాబోయే సీజన్ (IPL 2026)కి ముందు కోల్‌కతా ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. రస్సెల్ బెస్ట్ ఆల్ రౌండర్, విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉంది కనుక వేలంలో అతడి కోసం భారీ పోటీ ఉంటుందని అంతా ఊహించారు. అయితే, దానికంటే ముందే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రస్సెల్ IPL నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
IPL 2026 వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసింది. KKR పోస్టర్ బాయ్‌గా పేరుగాంచిన ఆండ్రీ రస్సెల్ పేరు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో ఆండ్రీ రస్సెల్ IPL నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఒక వీడియోను షేర్ చేశాడు. ఇందులో KKRలో గడిపిన కొన్ని మరపురాని క్షణాలు ఉన్నాయి. దీంతో పాటు, తాను IPL 2026లో KKRలో కొత్త పాత్రలో కనిపిస్తానని రస్సెల్ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)
KKR ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసింది?- 12 మంది ( అందులో ఇద్దరు విదేశీయులు)
- రిటైన్ చేసిన ఆటగాళ్లపై మొత్తం ఖర్చు- కేకేఆర్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం 60.70 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దాంతో IPL 2026 వేలంలో KKR అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ 64.30 కోట్ల రూపాయలు. అయితే స్టార్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్‌ను రిటైన్ చేసుకోకపోవడంతో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ రస్సెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
KKR రిటైన్ చేసిన ఆటగాళ్ళు: అజింక్యా రహానే, అంగక్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
```





















