IPL 2025 ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మ్యాచ్‌ల రీస్టార్ట్ డేట్ ఫిక్స్! షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
IPL 2025 To Restart : పాకిస్థాన్ దాడుల తర్వాత IPL తాజా సీజన్ మే 8న తాత్కాలికంగా నిలిపివేసిన బీసీసీఐ త్వరలోనే మ్యాచ్‌లు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.

IPL 2025 | భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విమరణ ఒప్పందం అనంతరం కొంతమేర పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. కానీ తాత్కాలికంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కొంతమేర తగ్గింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) పునఃప్రారంభానికి బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. పాక్‌తో సరిహద్దులో ఉద్రిక్తతలు పెరగడంతో ఐపీఎల్ తాత్కాలికంగా నిలిపివేసిన బీసీసీఐ టోర్నమెంట్ రీస్టార్ట్ చేసే పనుల్లో బిజీగా ఉంది. మే 8న పాకిస్తాన్ సరిహద్దులోని పలు భారత నగరాల్లో దాడులకు యత్నించడంతో IPL సీజన్ తాత్కాలికంగా నిలిపివేయడం తెలిసిందే.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మే 16వ తేదీన ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. కొన్ని రోజులపాటు మ్యాచ్‌లు నిర్వహించలేదు. దాంతో ఆ సమయాన్ని, తేదీలను భర్తీ చేయడానికి బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి మరో నిర్ణయం తీసుకుంటోంది. IPL షెడ్యూల్‌లో మరిన్ని చేసే అవకాశం ఉంది. డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహణతో ఇటీవల వారం రోజులు నిలిపివేసిన మ్యాచులను ఒకేరోజు రెండు మ్యాచ్‌ల నిర్వహణతో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. మే 25 నుంచి మే 30 లోపు ఐపీఎల్ సీజన్ ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీసీసీఐ. IPL పూర్తయిన వెంటనే టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
పాక్ దాడులతో భారత్ అలర్ట్..
మూడు రోజుల కిందట పాకిస్తాన్ ఒక్కసారిగా భారత్ లోని పలు నగరాలపై దాడికి యత్నించింది. ఓ వైపు భారత్ మేం కేవలం ఉగ్రవాదులు లక్ష్యంగా దాడి చేశామని, పాక్ ఆర్మీ జోలికిగానీ, పాక్ పౌరుల జోలికి వెళ్లలేదని స్పష్టంగా చెప్పింది. పాక్ మాత్రం ఉగ్రవాదులకు అధికారికి లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఆపై భారత్ లోని నగరాలపై డ్రోన్ దాడులకు యత్నించగా భారత బలగాలు అలవోకగా తిప్పికొట్టాయి. పాక్ కుయుక్తులను, డ్రోన్ దాడులను భారత దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి, కానీ ధర్మశాలతో సహా అనేక నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో స్థానిక స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య మ్యాచ్ జరుగుతోంది. కానీ స్టేడియం లైట్లు ఆపివేసిన వెంటనే ఆటగాళ్లను ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఆ మ్యాచ్ అధికారికంగా రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
పెండింగ్‌లో 12 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు
IPL 2025లో ఇప్పటివరకు 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. PBKS vs DC మ్యాచ్ 58వ మ్యాచ్ జరుగుతుండగా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు, 12 లీగ్-స్టేజ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు పెండింగ్ ఉన్నాయి.
మొదట్లో ప్లేఆఫ్ మ్యాచ్‌లను నిర్వహించడానికి హైదరాబాద్, కోల్‌కతా వేదికలు షెడ్యూల్ చేశారు. హైదరాబాద్‌లో క్వాలిఫైయర్ 1తో పాటు ఎలిమినేటర్, కోల్‌కతాలో క్వాలిఫైయర్ 2 సహా ఐపీఎల్ ఫైనల్ నిర్వహించనున్నారు. ఇటీవల పాక్‌తో ఉద్రిక్తతల కారణంగా, BCCI మిగిలిన మ్యాచ్‌లను దక్షిణ భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు వేదికలను మార్చాలని పరిశీలిస్తోంది.
BCCI ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆదివారం (మే 11) IPL 2025 పునఃప్రారంభంపై బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి తుది నిర్ణయం తీసుకోనున్నాయని ABP న్యూస్‌కు ఓ అధికారి తెలిపారు.





















