అన్వేషించండి

IPL 2025 ఫైనల్ ముగింపు వేడుకల్లో ఇండియన్ ఆర్మీకి గ్రేట్ ట్రిబ్యూట్.. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సెలబ్రేషన్స్

IPL 2025 ముగింపు కార్యక్రమం నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ ముందు జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ జరుపుకుంటారు, సైన్యానికి నివాళులు అర్పిస్తారు.

IPL 2025 Final Celebration: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుక నిర్వహిస్తారు. ఈ ముగింపు వేడుకల్లో ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తారు. అదే విధంగా భారతీయ త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతారు.

IPL 2025 లీగ్ స్టేజ్ పూర్తి కావొచ్చింది. మే 29 నుండి కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మే 29న పంజాబ్ లోని ముల్లంపూర్‌లో జరిగే క్వాలిఫైయర్ 1 విజేతగా నిలిచిన ఐపీఎల్ మొదటి ఫైనలిస్ట్ అవుతుంది. ఆ తర్వాత మే 30న ముల్లంపూర్‌లోనే ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. అది గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 ఆడటానికి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. క్వాలిఫయర్ 1 లో ఓడిన జట్టుతో, ఎలిమినేటర్ విజేత తలపడతాయి. 

జూన్ 1న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ 2 జరుగుతుంది. ఆ మ్యాచ్ గెలిచిన జట్టు రెండవ ఫైనలిస్ట్ అవుతుంది. టైటిల్ పోరు జూన్ 3న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుక నిర్వహిస్తారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని IPL ఫైనల్‌ వేడుకల్లో సెలబ్రేట్ చేస్తారు. అందుకోసం BCCI కొందరు ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది.

ముగింపు వేడుకలకు ఆర్మీ ప్రతినిధులు

 ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జరుపుకోవడానికి ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ దళాల చీఫ్‌లను, రక్షణ సిబ్బందికి చెందిన ప్రముఖులను బీసీసీఐ ఆహ్వానించింది.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఓ నేపాలీ సహా 26 మంది మరణించారు. తరువాత, భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది.  పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి, వారి పౌరులకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుని ఉగ్రస్థావరాలు నేలమట్టం చేసింది. అయినా పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో అమాయక పౌరులపై కాల్పులకు దిగింది. డ్రోన్ దాడులు సైతం చేసింది. అయితే భారత బలగాలు ఆ డ్రోన్లను ఛేదించడంతో పాటు పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసి ధ్వంసం చేశాయి..

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా IPL 2025ని వారం రోజులు తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. మే 17వ తేదీన ఐపీఎల్ సీజన్ రీస్టార్ట్ చేశారు. విదేశాలకు వెళ్లిన చాలా మంది ఆటగాళ్ళు IPL ఆడటానికి భారతదేశానికి తిరిగి వచ్చారు.

టైటిల్ పోటీలో ఈ నాలుగు జట్లు ఉన్నాయి

IPL సీజన్ 18 టైటిల్ కోసం ఇప్పుడు 4 జట్లు ప్లే ఆఫ్ చేరాయి. 6 జట్లు ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించాయి. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌ ఆడనున్నాయి. లీగ్ లో చివరి మ్యాచ్ ఆర్సీబీ, లక్నోల మధ్య జరగనుంది. తర్వాత పంజాబ్‌తో క్వాలిఫైయర్ 1లో ఏ జట్టు ఆడాలి, ఏ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అనేది తేలనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget