![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL Venues in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ వేదికలు సిద్ధం, స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు మీరు సిద్ధమా!
IPL Venues in Telangana : తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు స్డేడియానికి వెళ్లి లైవ్ చూసేందుకు హైదరాబాద్, విశాఖపట్నం వేదికలుగా మారాయి.
![IPL Venues in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ వేదికలు సిద్ధం, స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు మీరు సిద్ధమా! IPL 2024 venue of Andhra Pradesh and Telangana state grounds Hyderabad and Vizag IPL Venues in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ వేదికలు సిద్ధం, స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు మీరు సిద్ధమా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/4c9a1635477135c9680b6d2a51f36e661711009921495961_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indian Premier League: మెగా క్రికెట్ సంరంభం మొదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మొదటి మ్యాచ్ చెన్నైసూపర్‌కింగ్స్, రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న చెపాక్ మైదానం వేదికగా జరగనుంది. క్రికెట్‌ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లను ముందే బుక్ చేసుకొన్నారు. అమ అభిమాన టీంకు సపోర్టింగ్‌గా మైదానాలకు తరలిరాబోతున్నారు. అయితే ఈ సారి కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ రిలీజ్ అభిమానులు టికెట్లకోసం పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఈ ఫీవర్ మరింత ఎక్కువ ఉంది.
దేశంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఐపీయల్ లో తొలి 17 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అయితే మొదటివిడత మ్యాచ్‌ల్లో తెలుగురాష్ర్టాల్లో కేవలం 4 రోజులు మాత్రమే ఉండటం ...అభిమానులు ఎలాగైనా గ్రౌండ్‌కివెళ్లి తమ ఫేవరెట్ టీంలకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యే పరిస్థితులు కల్పించింది. దీంతో మ్యాచ్‌లు జరిగే నగరాలైన హైద్రాబాద్, విశాఖపట్నం లలో క్రికెట్‌ఫీవర్ కనిపిస్తోంది.
హైద్రాబాద్ ఆతిధ్యం
ఐపీయల్ మొదటిషెడ్యూల్‌లో భాగంగా మార్చి 27 బుధవారం రోజున సన్‌రైజర్స్ హైద్రాబాద్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఇక మ్యాచ్‌లో తమ ఫేవరెట్ ఆటగాళ్లని దగ్గరగాచూసేందుకు వారికి ఛీర్స్ చెప్పేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. ముఖ్యంగా కొత్త కెప్టెన్ ప్యాట్‌కమిన్స్‌తో సిద్ధమైన యస్.ఆర్.హెచ్ ఆటని చూసేందుకు తెలుగురాష్ర్టాల్లో అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే మార్చి 31 ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నైసూపర్‌కింగ్స్ మధ్య విశాఖపట్నం లో మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ తన హోంగ్రౌండ్ కాకుండా విశాఖపట్నంలో మ్యాచ్ ఆడబోతోంది.
ధోనీకోసం వైజాగ్ సిధ్ధం
ఇక మార్చి 31 న ఢిల్లీ,చెన్నైమధ్య మ్యాచ్‌ని చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మరీ ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోనీ అభిమానులు ఈ మ్యాచ్ మిస్‌కావద్దని ఎదురుచూస్తున్నారు. ధోనీ కి అచ్చొచ్చిన విశాఖ మైదానంలో చెన్నై చెలరేగిఆడాలని అభిమానులు కోరుకొంటారు. అందులోనూ ధోనీ ని మైదానంలో చూడటం దాదాపు చివరి సారన్న భావనలో అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కి క్రౌడ్ నిండిపోబోతుందని అర్ధమవుతోంది.
అలాగే, ఏప్రిల్ 3న విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా తమ అభిమాన ఆటగాళ్లని ఎంకరేజ్ చేయడంకోసం అభిమానులు సిధ్ధమయ్యారు. ఇక మరో మ్యాచ్ ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ హైద్రాబాద్ , చెన్నైసూపర్‌కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కి వేదిక హైద్రాబాద్ కానుంది. ఇక మ్యాచ్ కోసం అభిమానలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎవరుగెలవాలన్నది తర్వాత ... తమ అభిమాన ఆటగాళ్లు ఆడే షాట్‌లకు బంతి ఉప్పల్ స్టేడియంలోని స్టాండ్స్‌లో పడాలి....మా అరుపులతో మైదానం మార్మోగిపోవాలని ఫ్యాన్స్ అంటున్నారు.
మరి మిగిలిన మ్యాచ్‌లు...
ఇక తొలి 17 రోజుల మ్యాచ్‌ల సమయంలోనే మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ ని రిలీజ్ చేయనున్నారు నిర్వాహకులు.దీంతో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా... మ్యాచ్‌లు ఇండియాలోనే జరగనున్నాయా లేక వేరే దేశానికి తరలిపోనున్నాయా అనే సందేహం అభిమానుల మనసు తొలిచేస్తోంది. దానిక త్వరగా క్లారిటీ ఇవ్వాలని అభిమలునులంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ తొలి షెడ్యూల్లో మ్యాచ్ జరిగే మైదానాల్లో ప్రత్యక్షమవ్వాలని టిక్కెట్ల వేటలో అభిమానులున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)