అన్వేషించండి

IPL 2024: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కొత్త రూల్‌! , బౌలర్ల చేతికి మరో ఆయుధం

IPL 2024: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఒక ఓవర్లో బౌలర్లు రెండు బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఇస్తారు. బౌలర్లకు అనుకూలంగా ఉండే ఈ రూల్‌తో హిట్టర్ల బాదుడుకు అడ్డుకట్ట వేసినట్లేనని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి 22 నుంచి IPL ప్రారంభం కానుందని సోషల్ మీడియాతోపాటు జాతీయ మీడియా సంస్థల్లో కోడై కూస్తున్నాయి. సూమారు రెండు నెలలపాటు సాగనున్న ఈ టోర్నీ మే నెల చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత ఐపీఎల్‌-2024 సీజన్‌ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఐపీఎల్‌ 17వ సీజన్‌ కోసం బీసీసీఐ మరో కొత్త నిబంధన తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
 
బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీని మరింత పెంచేలా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పటికే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఈ రూల్‌ను పరీక్షించారు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లోనూ దీన్ని అమలు చేసేందుకు బీసీసీఐ ఇప్పటికే ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఒక ఓవర్లో బౌలర్లు రెండు బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఇస్తారు. బౌలర్లకు అనుకూలంగా ఉండే ఈ రూల్‌తో హిట్టర్ల బాదుడుకు అడ్డుకట్ట వేసినట్లేనని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఐసీసీ వన్డే, టెస్టుల్లో ఓవర్‌కు రెండు బౌన్సర్లను అనుమతిస్తుండగా.. టీ20 ఫార్మాట్‌లో ఒక బౌన్సర్‌కే అనుమతి ఉంది.  ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నారన్న వార్తలపై టీమ్‌ఇండియా పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ స్పందించాడు. ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసే అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయమన్నాడు. ఈ కొత్త నిబంధనతో బౌలర్లకు మరో ఆయుధం ఇచ్చినట్లే అని అభిప్రాయపడ్డాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.
 
అయితే ఈ వేలంలో భారీ ధర దక్కించుకుంటారనుకున్న అంచనాలు తప్పాయి. దిగ్గజ ఆటగాళ్లకు ఈసారి జరిగిన మినీ వేలంలో నిరాశే ఎదురైంది. అమ్ముడుపోని టాప్‌- 10 ఆటగాళ్లను  ఓసారి పరిశీలిస్తే. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌ మినీ వేలంలో అమ్ముడుపోలేదు. స్మిత్‌ను దక్కించుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు.  స్మిత్‌తో పాటు జోష్ ఇంగ్లిస్, ఆదిల్ రషీద్, వాండర్ డసెన్‌, జేమ్స్ విన్స్, సీన్ అబాట్‌, జేమీ ఓవర్టన్, బెన్ డకెట, ఫిలిప్ సాల్ట్, జోష్‌ హేజిల్ వుడ్ అమ్ముడు పోలేదు.

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget