అన్వేషించండి

IPL 2024: ఈ లెక్కలు నిజమైతే, కప్పు హైదరాబాద్‌దే

Sunrisers Hyderabad: బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌తో విధ్వంసం సృష్టించిన హైదరాబాద్... ఒక్క మ్యాచ్‌తోనే ఐపీఎల్‌ టైటిల్‌పై ఆశలు రేపింది.

Sunrisers Hyderabad: బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్‌తో విధ్వంసం సృష్టించిన హైదరాబాద్(SRH)... ఒక్క మ్యాచ్‌తోనే ఐపీఎల్‌(IPL) టైటిల్‌పై ఆశలు రేపింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు అందరూ భీకర ఫామ్‌లో ఉండడంతో ఈసారి కప్‌ సన్‌రైజర్స్‌దే అని SRH అభిమానులు ధీమాగా ఉన్నారు. అంతేనా గత లెక్కలను కూడా బయటకు తీస్తున్నారు. 2015లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ కప్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు 2023లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ విజయం సాధించింది. 2024లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌ ఇప్పుడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ లెక్కలను చూస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు...ఈసారి కప్పు మనదే అని సోషల్‌ మీడియను హోరెత్తిస్తున్నారు. 

మార్పు మంచిదే
ఐపీఎల్‌ ప్రారంభమైన తర్వాత అత్యధిక స్కోరు 263. సరిగ్గా పదకొండేళ్ల క్రితం యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ 175 పరుగులతో అజేయంగా నిలవడంతో... బెంగళూరు 5 వికెట్లకు ఏకంగా 263 పరుగులు చేసింది. ఈ రికార్డును ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకుండా సన్‌రైజర్స్‌ బద్దలుకొట్టింది. దీనినిబట్టి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు ఎంత సమష్టిగా రాణించారో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు అత్యధిక పరుగుల రికార్డును మళ్లీ బెంగళూరో, ముంబై లాంటి జట్టో బద్దలు కొడుతుందనే అంచనాలుండేవి. కానీ ఆశ్చర్యకరంగా హైదరాబాద్‌ రికార్డును సొంతం చేసుకుంది. నెమ్మదైన బ్యాటింగ్‌కు పేరుపడ్డ సన్‌రైజర్స్‌లో వార్నర్‌ కెప్టెన్‌ అయ్యాకే దూకుడు పెరిగింది.

ఈ దూకుడు అసాధారణం
కానీ ఇప్పుడున్న దూకుడు మాత్రం అసాధారణం. హెన్రిచ్‌ క్లాసెన్‌ రాకతో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌ స్వరూపం మారింది. ఈ సీజన్‌కు ట్రావిస్‌ హెడ్‌ కూడా తోడయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే హెడ్‌ తనలోని విధ్వంసక ఆటతీరును ఐపీఎల్‌కు పరిచయం చేశాడు. ట్రావిస్‌ దూకుడుకే తట్టుకోలేకపోతుంటే.. తర్వాత అభిషేక్‌ శర్మ వచ్చాడు. హెడ్‌ 18 బంతుల్లో అర్ధశతకం సాధించి సన్‌రైజర్స్‌ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న బ్యాటర్‌గా నిలిస్తే.. కొన్ని నిమిషాల్లోనే ఆ రికార్డును అభిషేక్‌  బద్దలు కొట్టాడు. క్లాసెన్‌  ఈ సీజన్లో 11 సిక్సర్లు బాదాక కానీ తొలి ఫోర్‌ కొట్టలేదంటే అతడి బ్యాటింగ్‌ తీరు అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మరో రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో 10 ఓవర్ల అనంతరం అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీనికి ముందు తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్‌ రికార్డు ముంబై ఇండియన్స్‌ పేరిట ఉండేది. 2021 సీజన్‌లో ముంబై తొలి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.  సన్‌రైజర్స్‌ ఇదే జోరు కొనసాగిస్తే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పకపోవచ్చు. ప్రత్యర్థి ఇక పరాక్‌. బహు పరాక్‌..

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget