IPL 2024: బ్యాటింగ్ హైదరాబాద్‌దే - మరో విధ్వంసమేనా ?
SRH Vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ తో జరుగతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
IPL 2024 SRH Vs GT SRH chose to bat : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17వ సీజన్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్(GT)తో జరుగతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్(SRH) బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. హైదరాబాద్‌కు కూడా రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో నాలుగో స్థానంలో ఉంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ రెండో మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో ముంబైని ఓడించింది. రెండు జట్లు ఒక మ్యాచ్ గెలువగా, ఇప్పుడు రెండో గెలుపు సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. రెండు జట్లలో కూడా మంచి ఆటగాళ్లు ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో గుజరాత్ 2, హైదరాబాద్ 1 గెలిచాయి. SRHపై GT అత్యధిక స్కోరు 199 పరుగులు. కాగా గుజరాత్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 195 పరుగులు. ఈ మ్యాచులో ఇరు జట్లు కూడా 50 శాతం గెలిచే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు పేస్, బౌన్స్ ఉంటాయన్నారు. స్పిన్నర్లకు కూడా సపోర్ట్ లభిస్తుందని వెల్లడించారు.
జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ మింజ్, కేన్ విలియమ్సన్, అభినవ్ మంధర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, శాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, మానవ్ సుతార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.