IPL 2024: యువరాజ్ సింగ్ శిష్యుడు, వరల్డ్ కప్ కోసమే బాదుడు!
Abhishek Sharma Batting : ఈ ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మ సన్ రైజర్స్ కి కీలక బ్యాటర్ లా మారిపోయాడు. బ్యాటింగ్ చూసిన తర్వాత అంతా గురువుకి తగ్గ శిష్యుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Abhishek Sharma Batting : ఐపిఎల్ 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ(Delhi) హోం గ్రౌండ్ లోనే ఆ టీమ్ పై హైదరాబాద్ ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆటకు ఢిల్లీ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోతోంది. కేవలం 5 ఓవర్లలోనే టీమ్ స్కోర్ 100 దాటేసింది. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో కూడా చెలరేగి ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా అభిషేక్ శర్మ కూడా విజృంభించాడు. కేవలం 12 బంతుల్లోనే 46 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మ ఒక్క అడుగులో హైదరాబాద్ జట్టు తరఫున వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మ సన్ రైజర్స్ కి కీలక బ్యాటర్ లా మారిపోయాడు. ఓపెనర్ గా వచ్చి అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడుతున్న తీరు సన్ రైజర్స్ రికార్డుల మీద రికార్డులు బద్ధలు కొట్టేలా చేస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 7 మ్యాచులు ఆడిన అభిషేక్..215 స్ట్రైక్ రేట్ తో 257పరుగులు చేశాడు. ముంబై మీద 16బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా 277పరుగులు స్కోరు బాదటంలో కీలకపాత్ర పోషించాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 12బంతుల్లో 2ఫోర్లు, 6 సిక్సర్లతో 46పరుగులు చేశాడు. పొరపాటున అవుటయ్యాడు కానీ అభిషేక్ కనిబరిచిన ఫామ్ కి ఫాస్టెస్ట్ సెంచరీ బాదేసేవాడేమో. ప్రత్యేకించి స్పిన్నర్లను అతను ఆడుతున్న తీరు చూస్తుంటే ముచ్చట వేస్తుంది. యువరాజ్ సింగ్ దగ్గర బ్యాటింగ్ లో మెలకువలు నేర్చుకున్న అభిషేక్ శర్మ సన్ రైజర్స్ క్యాంప్ లో లారా దగ్గర శిక్షణ పొందుతున్నాడు.
సన్ రైజర్స్ కి ఈ స్థాయిలో ఆడుతున్నా అభిషేక్ టార్గెట్ మాత్రం త్వరలో జరగబోయే టీ20వరల్డ్ కప్ కి సెలెక్ట్ కావటమే. ఐపీఎల్లో ఇప్పటికే 18ఫోర్లు, 24సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ తన రేంజ్ తో ఫర్ ఫార్మెన్స్ తో టీ20లకు తనెంత సూటబుల్ ఆటగాడినో పరిచయం చేస్తూ సెలక్టర్లకు స్వీట్ హెడేక్ గా మారాడు. అభిషేక్ శర్మ విజృంభిస్తుంటే.. అచ్చం యువరాజ్ ఆడుతున్నట్లే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.చూడాలి మరి అభిషేక్ తన ఫామ్ ను ఇలానే కొనసాగిస్తే.. తన శిష్యుడిని వరల్డ్ కప్ కి పంపించిన గురువుగా యువరాజ్ సింగ్ మరోసారి టీమిండియాకు వరల్డ్ కప్ లో హెల్ప్ అవుతాడేమో.