అన్వేషించండి

IPL 2024: కోహ్లీ శతకంతో మెరిసినా RCBకి తప్పని ఓటమి, బట్లర్ సెంచరీతో రాజస్తానే టాప్

RR vs RCB IPL 2024: ఐపీఎల్‌లో బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. నాలుగు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడిపోయింది.

IPL 2024 Rajasthan Royals won by 6 wkts: ఐపీఎల్‌లో బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ బెంగళూరు ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ శతకంతో చెలరేగినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కింగ్‌ కోహ్లీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే తొలి శతకంతో చెలరేగిన వేళ... రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ మరో  5 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. జోస్‌  బట్లర్‌, సంజు శాంసన్‌ విధ్వంసంతో రాజస్థాన్‌... బెంగళూరుపై విజయం సాధించింది.
 
కోహ్లీ ఒక్కడే...
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. చివరి బంతికి డుప్లెసిస్ బౌండరీ బాదాడు. ఆరంభం నుంచే విరాట్ కోహ్లీ  దూకుడుగా ఆడాడు. నంద్రి బర్గర్ వేసిన రెండో ఓవర్‌లో 13 పరుగులు రాగా.. కోహ్లీ రెండు బౌండరీలు బాదాడు. నంద్రి బర్గర్ వేసిన నాలుగో ఓవర్‌లో రెండో బంతిని డీప్‌ బ్యాక్‌వర్డ్ స్వ్కేర్‌ లెగ్‌ మీదుగా కోహ్లీ కొట్టిన సిక్సర్‌ చూసి తీరాల్సిందే. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 88 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. సిక్స్‌తో కోహ్లీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.11 ఓవర్లకు స్కోరు 98/0. 12ఓవర్‌లో బెంగళూరు స్కోరు వంద పరుగులు దాటింది. 13 ఓవర్లకు స్కోరు 115/0. చాహల్ వేసిన 14 ఓవర్‌లో చివరి బంతికి 44 పరుగులు చేసిన డుప్లెసిస్‌ అవుటయ్యాడు. అనంరం మ్యాక్స్‌వెల్  ఒక్క పరుగే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నంద్రి బర్గర్ వేసిన 15 ఓవర్‌లో ఐదో బంతికి మ్యాక్సీ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 16వ ఓవర్‌లో బెంగళూరు స్కోరు 150 దాటింది. 17 ఓవర్లకు స్కోరు 154/2. చాహల్ వేసిన 17.2 ఓవర్‌కు సౌరభ్‌ చౌహన్‌ 9 పరుగులు చేసి యశస్వి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌లో మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో కోహ్లీ మూడంకెల స్కోరు అందుకున్నాడు. విరాట్‌ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  విరాట్‌ ఒంటరి పోరుతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
 
శాంసన్‌, బట్లర్‌ జోరు
184 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే యశస్వీ జైస్వాల్‌ డకౌట్‌ అయ్యాడు. ఈ ఆనందం బెంగళూరుకు ఎంతోసేపు నిలవలేదు. జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌... బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శాంసన్‌ 42 బంతుల్లో 69 పరుగులు చేసి అవుటైనా బట్లర్‌ చివరి దాకా క్రీజులో నిలబడి రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్‌ 58 బంతుల్లో  4సిక్సులు 9 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్‌ మరో 55 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget