IPL 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్, ముంబైని అడ్డుకుంటుందా
PBKS vs MI : ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్‌తో ముంబయి తలపడనుంది. పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL 2024 PBKS vs MI Punjab Kings opt to bowl : ఐపీఎల్ (IPL) 17 సీజన్‌లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్(PBKS)తో ముంబయి(MI) తలపడనుంది. కెప్టెన్ సామ్ కరన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భుజం గాయం కారణంగా పది రోజుల పాటు జట్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌కి కూడా దూరమయ్యాడు. ఈ ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రెండు జట్లు.. తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో పంజాబ్ సూపర్ కింగ్స్.... ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. రెండు జట్లు నాలుగేసి పాయింట్లతో సమానంగా ఉన్న ముంబై కంటే రన్‌రేట్ పరంగా పంజాబ్ పైన ఉంది. గత మ్యాచులో రెండు జట్లు పరాజయం పాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
రికార్డులకు చేరువలో బ్యాటర్లు
రోహిత్ శర్మ మరో 28 పరుగులు చేస్తే IPLలో 6500 పరుగుల మార్క్‌ను చేరుకుంటాడు. ప్రస్తుతం 932 పరుగులతో ఉన్న లియామ్ లివింగ్‌స్టోన్ మరో 68 పరుగులు చేస్తే IPLలో 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. సూర్యకుమార్ యాదవ్ T20ల్లో 300 సిక్సర్లు చేరుకోవడానికి మరో రెండు సిక్సర్లు కావాలి. హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో 2500 పరుగులకు చేరుకోవడానికి మరో అరవై పరుగులు కావాలి. IPLలో 1000 పరుగులకు చేరుకోవడానికి తిలక్‌వర్మకు మరో తొంభై పరుగులు కావాలి.