అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

PBKS vs DC : మ్యాచ్ చివర్లో అభిషేక్‌ ధనా ధన్‌ - పంజాబ్‌ లక్ష్యం 175

PBKS vs DC LIVE Score, IPL 2024: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడినా, మధ్యలో కష్టాల్లో పడింది. కానీ అభిషేక్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో భారీ స్కోరు చేసింది

 Punjab Kings vs Delhi Capitals punjab target 175: పంజాబ్‌( Punjab Kings)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ( Delhi Capitals)భారీ స్కోరు చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడిన పంజాబ్‌ మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ చివర్లో అభిషేక్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో భారీ స్కోరు చేసింది. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి సత్తా చాటాడు. అభిషేక్‌ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. హోప్‌ 33, వార్నర్‌ 29, మార్ష్‌ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంత్‌... 18 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2, హర్షల్‌ పటేల్‌ 2, రబాడ,బ్రార్‌, చాహల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

ఆరంభంలో ధాటిగానే ఆడినా... 
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన పంజాబ్‌ కెప్టెన్ శిఖర్ ధావన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఢిల్లీ ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌, వార్నర్‌ ధాటిగా బ్యాటింగ్‌ ఆరంభించారు. సామ్‌ కరన్‌ వేసిన తొలి ఓవర్‌లో మార్ష్‌ 2 బౌండరీలు బాది 10 పరుగులు రాబట్టాడు. అనంతరం వార్నర్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. ఒకే ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ కొట్టి స్కోరు బోర్డుకు జెట్‌ వేగాన్ని అందించాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన మూడు, నాలుగు బంతులకు వరుసగా సిక్సర్‌, ఫోర్‌ బాదాడు. రెండో ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. రబాడ వేసిన మూడో ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. తొలి బంతికే మిచెల్ మార్ష్‌ సిక్స్‌ బాదాడు. మంచి ఊపుమీదున్న మార్ష్‌ను అర్ష్‌దీప్‌ అవుట్ చేశాడు. 12 బంతులలో 20 పరుగులు చేసి మార్ష్‌ అవుటయ్యాడు. నాలుగు ఓవర్లకు ఢిల్లీ స్కోరు 40 పరుగులకు చేరింది. రబాడ వేసిన ఐదో ఓవర్‌లో నాలుగో బంతికి ఫోర్, ఐదో బంతికి సిక్స్‌ బాదిన వార్నర్‌ ఢిల్లీ జట్టు స్కోరు 50 పరుగులు దాటించాడు. షై హోప్‌ కూడా ఫోర్‌, సిక్స్ బాది మంచి టచ్‌లో కనిపించాడు. కానీ మంచి ఫామ్‌లో కనిపించిన వార్నర్‌... 29 పరుగులు చేసి అవుటయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో చివరి బంతికి డేవిడ్‌ భాయ్‌ వికెట్ కీపర్‌ జితేశ్‌కు చిక్కాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించిన పంజాబ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లి ఫలితం రాబట్టింది.

పంత్‌  మంచి టచ్‌లో కనిపించినా...
వార్నర్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌ రిషభ్‌ పంత్‌ తొలి మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఆరంభంలో క్రీజులోకి స్వేచ్ఛగా కదులిన పంత్‌ ఓ ఫోర్‌ కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. ఆడిన తొలి మూడు బంతుల్లో రెండు సింగిల్స్‌ తీసి భారీ స్కోరు చేస్తాడని ఆశలు రేపాడు. రాహుల్ చాహర్‌ వేసిన 12 ఓవర్‌లో రెండో బంతిని బౌండరీకి పంపి ఈ ఐపీఎల్‌లో రిషభ్ పంత్‌ మొదటి బౌండరీ సాధించాడు. ఆ తర్వాత మరో బౌండరీ బాది ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. మొత్తం 13 బంతులు ఎదుర్కొన్న పంత్‌ 2 ఫోర్లతో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. హర్షల్‌  పటేల్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టోకు సులువైన క్యాచ్‌ ఇచ్చి పంత్‌ అవుటయ్యాడు.

వరుసగా వికెట్ల పతనం
పంత్‌ తర్వాత ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. రిషభ్‌ పంత్ (18‌)  రికీ భుయ్‌ (3) స్టబ్స్‌ (5) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. 21 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్న అక్షర్‌ పటేల్ రనౌట్‌ కావడంతో ఢిల్లీ కష్టాలు పెరిగాయి. హర్షల్‌ పటేల్ వేసిన 18 ఓవర్‌లో తొలి బంతికి రెండో పరుగు కోసం యత్నించి అక్షర్‌ రనౌటయ్యాడు. చివర్లో అభిషేక్‌ పటేల్‌ చెలరేగడంతో ఢిల్లీ 165 పరుగులు చేయగలిగింది. ఎనిమిది బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ 2 ఫోర్లు  ఒక సిక్సుతో 20 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2, హర్షల్‌ పటేల్‌ 2, రబాడ,బ్రార్‌, చాహల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget