IPL 2024 Mini Auction: 77 ఖాళీలు, 333 మంది ఆటగాళ్లు - ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం
IPL 2024 Mini-Auction: ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
దేశంలో ఐపీఎల్(IPL) సందడి మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా... వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. 77 ఖాళీలు ఉండగా.... ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు 333 మంది పోటీ పడుతున్నారు.
ఐపీఎల్ వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా..ఐపీఎల్ పాలకవర్గం మొత్తం ఈ జాబితాను పది ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల కింద జరిగిన వేలంలో హర్షల్ రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయాడు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 మంది నుంచి గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను జట్లు కొనుక్కోవచ్చు. ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్‌కు మంచి ధర పలికే అవకాశం ఉంది. ఈ ఆసీస్ త్రయం 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర తన కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సైతం ఈ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. ఎట్టకేలకు గత సీజన్‌లో అరంగేట్రం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ తరహా లీగ్‌లు జరుగుతాయి. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయే వేరు. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది.