అన్వేషించండి

IPL 2024: ముంబై గాడిన పడుతుందా?, రాజస్థానే గెలుస్తుందా?

Mumbai Indians Vs Rajasthan Royals: నూతన సారధి హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్‌ కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది.సొంత మైదానం వాంఖడేలో రాజస్థాన్‌ రాయల్స్‌తో హార్దిక్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

MI vs RR Match Preview: నూతన సారధి హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్‌(MI) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. సొంత మైదానం వాంఖడేలో రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో హార్దిక్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఏ మూహూర్తాన కెప్టెన్‌గా రోహిత్‌ను తొలిగించి హార్దిక్‌ పాండ్యాను నియమించారో కానీ అప్పటినుంచి  ముంబైకి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ముంబై ఓడిపోవడంతో హార్దిక్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. ఆటగాడిగా రాణించని పాండ్యా.. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌... హార్దిక్‌కు చాలా కీలకంగా మారనుంది. ముంబై ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోగా... రాజస్థాన్‌ మాత్రం ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి జైత్రయాత్ర కొనసాగించాలని రాజస్థాన్‌ చూస్తుండగా.... గెలుపు బాట పట్టాలని ముంబై వ్యూహాలు రచిస్తోంది.

పాయింట్ల పట్టికలో చివరి స్థానం
ఐపీఎల్‌ టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇప్పుడు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇవి తొలి దశ మ్యాచ్‌లే అయినా ముంబై లాంటి భీకర జట్టుకు రెండు మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురవ్వడమే ఫ్యాన్స్‌ను ఆందోళన పరుస్తోంది. ముంబై నెట్‌ రన్‌రేట్‌ కూడా ఘోరంగా -0.925గా ఉంది. అన్ని జట్టలో ఇదే తక్కువ రన్‌రేట్‌ కావడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం ముంబై బ్యాటింగ్‌ లయను దెబ్బతీస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తమ చివరి ఐదు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు విజయం సాధించింది. కానీ ఇప్పుడు రాజస్థాన్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. సంజూ శాంసన్ జట్టు రెండు మ్యాచుల్లో గెలవడంతో ముంబైకి కూడా కఠిన సవాల్‌ తప్పకపోవచ్చు. ముంబైకి మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యం రావాల్సి ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్ నుంచి ముంబై జట్టు భారీ స్కోర్లు ఆశిస్తోంది. జస్ప్రీత్ బుమ్రాను పాండ్యా సరైన సమయంలో వాడుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఈ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. బుమ్రా, పీయూష్ చావ్లాలు బౌలింగ్‌లో రాణిస్తున్నారు. వాంఖడే స్టేడియంలో అపారమైన అనుభవం కలిగిన స్థానిక కుర్రాడు షమ్స్ ములానీ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నమన్ ధీర్‌లు కూడా భారీ స్కోర్లపై కన్నేశారు. 

శాంసన్‌ రాణిస్తే..
ఐపీఎల్‌లో శాంసన్‌ రాణిస్తుండడం రాజస్థాన్‌కు కలిసిరానుంది. యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో ఇంతవరకూ భారీ స్కోరు చేయలేదు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేయాలని యశస్వీ పట్టుదలగా ఉన్నాడు. రియాన్ పరాగ్ గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌కు విజయం అందించాడు. జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌ల స్పిన్ ద్వయాన్ని ఎదుర్కోవడం ముంబైకు కష్టమే. 

జట్లు
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫకా, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్.

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కొహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొటియన్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Embed widget