అన్వేషించండి
Advertisement
IPL 2024:మరోసారి మెరిపించిన నరైన్, లక్నో ముందు భారీ లక్ష్యం
IPL 2024, LSG vs KKR: లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు జూలు విదిల్చారు. సునీల్ నరైన్ చెలరేగిపోవడంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
IPL 2024 LSG vs KKR Lucknow Super Giants target 236 : లక్నో సూపర్ జెయింట్స్(LSP)పై కోల్‌కత్తా(KKR) బ్యాటర్లు జూలు విదిల్చారు. మరోసారి 200కు పైగా పరుగులు సాధించారు. సునిల్ నరైన్ మరోసారి జూలు విదిల్చడంతో కోల్‌కత్తా నిర్ణీత 20ఓవర్లలో 235 పరుగుల భారీ స్కోరు చేసింది. సునిల్ నరైన్ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. రఘువంశీ, ఫిల్ సాల్ట్ కూడా పర్వాలేదనిపించారు. చివర్లో శ్రేయస్స్ అయ్యర్, రమణ్‌దీప్ సింగ్ బ్యాట్లు ఝుళిపించడంతో కోల్‌కత్తా మరోసారి భారీ స్కోరు చేసింది. దీంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ మూడు వికెట్లు తీశాడు.
నరైన్ మరోసారి..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో... కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కత్తా ఓపెనర్లు ఫిల్ సాల్ట్... సునీల్ నరైన్ మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. ఫిల్ సాల్ట్ కేవలం 14 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సుతో 32 పరుగులు చేసి సాల్ట్ అవుటయ్యాడు. సాల్ట్ అవుటైనా నరైన్, రఘువంశీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే ముగిసేసరికి కోల్‌కతా ఒక వికెట్ కోల్పోయి 70 పరుగులు చేసింది. కృనాల్ పాండ్య వేసిన ఏడో ఓవర్లో బ్యాటర్ లు వరుసగా 3 సిక్స్ లు కొట్టారు. రవి బిష్ణోయ్ వేసిన 10వ ఓవర్‌లో తొలి బంతికి నరైన్ ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. నరైన్ 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం తర్వాత మరింతగా రెచ్చిపోయిన సునీల్ నరైన్ స్టాయినిస్ వేసిన 11వ ఓవర్‌లో చివరి నాలుగు బంతుల్లో మూడు సిక్స్‌లు బాదాడు. అయితే సరిగ్గా 140 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 81 పరుగులు చేసిన నరైన్.. రవి బిష్ణోయ్ వేసిన 12 ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడి పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తరువాత రఘువంశీ ధాటీ గా ఆడుతుండగా కోల్‌కతా 167 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. నవీనుల్ హక్ వేసిన 15వ ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ బాదిన ఆండ్రీ రస్సెల్ తర్వాతి బంతికే కృష్ణప్ప గౌతమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. తరువాత కోల్‌కతా 171 పరుగుల రఘువంశీ అవుట్ అయ్యాడు. యుధ్విర్ సింగ్ వేసిన 15.1 ఓవర్‌లో వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. నవీనుల్ హక్ వేసిన 18 ఓవర్‌లో ఐదో బంతికి బౌండరీ కొట్టిన రింకు సింగ్కూ డా బౌండరీ బాది చివరి బంతికి, 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టాయినిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. శ్రేయస్స్ అయ్యర్ 15 బంతుల్లో మూడు ఫోర్లతో 23 పరుగులు చేయగా....రమణ్‌దీప్ సింగ్ ఆరు బంతుల్లోనే ఒక ఫోరు, మూడు సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ మూడు వికెట్లు తీశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion