IPL 2024: కోల్‌కత్తాకు చెలగాటం, బెంగళూరుకు ప్రాణ సంకటం
KKR vs RCB: ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న బెంగళూరు..పటిష్టమైన కోల్‌కత్తాతో మ్యాచ్‌కు సిద్ధమైంది. మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్ ఆశలైనా సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి.
IPL 2024 KKR vs RCB Match Preview and Prediction : ఐపీఎల్(IPL)లో చావోరేవో తేల్చుకునే మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సిద్ధమైంది. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న బెంగళూరు..పటిష్టమైన కోల్‌కత్తా(KKR)తో మ్యాచ్‌కు సిద్ధమైంది. మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్ ఆశలైనా సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి.
పటిష్టమైన కోల్‌కత్తా జట్టును ఆత్మవిశ్వాసం లోపించిన బెంగళూరు జట్టు ఎదుర్కొంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాటింగ్‌లో చాలా బలంగా కనిపిస్తున్న బెంగళూరు జట్టు.. బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. మ్యాచ్‌లు గడుస్తున్నా కొద్దీ గాడిన పడుతుందనుకున్న బెంగళూరు బౌలింగ్... రానురాను మరింత తీసికట్టుగా మారిపోయింది. జట్టులో ఎన్ని మార్పులు చేస్తున్నా బెంగళూరు జట్టు మాత్రం.. ఇంకా విజయాల బాట మాత్రం పట్టలేదు.
బెంగళూరు బెంగ తీరేదెలా..?
ఈ ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా మూసుకుపోతాయి. కాబట్టి బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో తెగించి ఆడే అవకాశం ఉంది. ఇక పోయేదేమీ లేదు కాబట్టి ప్రతీ మ్యాచ్‌ను సెమీఫైనల్‌గా భావించి ఆడుతామని ఇప్పటికే బెంగళూరు కోచ్ ప్రకటించాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో బెంగళూరు తొలి ఐపిఎల్ టైటిల్ కలకు దాదాపు దూరమైంది. ఏడు మ్యాచుల్లో ఆరు ఓటములు ఒక విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి మిగిలిన ఏడు మ్యాచుల్లోనూ బెంగళూరు గెలవాల్సిన పరిస్థితి ఉంది. బెంగళూరు బౌలింగ్ వారికి పెద్ద బలహీనతగా మారింది.
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, దినేష్ కార్తీక్‌ల బ్యాటింగ్‌పై ఎక్కువ ఆధారపడుతున్న బెంగళూరు జట్టు.. కోల్‌కత్తాను ఎదుర్కోవడం పెద్ద సవాల్‌గా మారింది. తమకు బౌలింగ్‌లో పెద్దగా వనరులు లేవని.. బ్యాటింగ్ బలంతో... ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తామని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. భారీ స్కోర్లు చేసి మ్యాచ్‌లను గెలిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి.. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోసి మూడు వికెట్ల నష్టానికి 287పరుగుల భారీ స్కోరు సాధించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేశారు. అల్జారీ జోసెఫ్‌ను బెంగళూరు జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్‌తో అల్జారీ జోసెఫ్ బంతిని పంచుకోనున్నాడు. మ్యాక్స్ వెల్ స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారో చూడాలి. కోహ్లీ, డు ప్లెసిస్, కార్తీక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
కోల్‌కత్తా బలం
సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణాలతో కోల్‌కత్తా బలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కత్తా నాలుగు విజయాలు.. రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు మరింత చేరువ కావాలని కోల్‌కత్తా భావిస్తోంది. నరైన్ కేవలం బంతితో మాత్రమే కాకుండా బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో తన తొలి T20 సెంచరీని సాధించిన నరైన్... ఈ ఐపీఎల్ సీజన్‌లో 187 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 276 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కత్తా టాప్ ఆర్డర్ మెరుగ్గా రాణిస్తుండడంతో రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ వంటి మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు పరిమిత అవకాశాలు వచ్చాయి. తొలి అర్ధ సెంచరీతో యువ ఆటగాడు రఘువంశీ ఆకట్టుకున్నాడు.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, రఘువంశీ, రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబుర్ రెహమాన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ దీప్, ఆకాశ్‌కుమార్, వైషక్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కుర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.