IPL 2024 KKR vs RCB Head to Head Records: మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్ ఆశలైనా సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు బెంగళూరు(RCB) సిద్ధమైంది. భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(Virat Kohli)పైనే ఆశలు పెట్టుకుని బౌలర్లపై ఆశలు వదులుకుని బెంగళూరు కోల్‌కత్తా(KKR)తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇక పోయేదేమీ లేదు కాబట్టి ప్రతీ మ్యాచ్‌ను సెమీఫైనల్‌గా భావించి ఆడుతామని ఇప్పటికే బెంగళూరు కోచ్ ప్రకటించాడు. మకు బౌలింగ్‌లో పెద్దగా వనరులు లేవని.. బ్యాటింగ్ బలంతో... ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తామని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. అంటే బెంగళూరు బ్యాటర్లు భారీ స్కోర్లు చేసి... మ్యాచ్‌ను గెలవాలని చూస్తున్నారు. కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలని బెంగళూరు చూస్తుండగా.. ఆర్సీబీ బౌలింగ్ లోపాలను ఆసరాగా చేసుకుని విరుచుకుపడాలని కోల్‌కత్తా చూస్తోంది.
హెడ్ టు హెడ్ రికార్డులు
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో కోల్‌కత్తా- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిలో కోల్‌కత్తా 18 మ్యాచుల్లో గెలవగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచుల్లో విజయం సాధించింది. 2017లో కోల్‌కత్తాపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 49 పరుగుల అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది. ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. విరాట్ కోహ్లీ 858 పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 606, ఎబి డివిలియర్స్ 475, గౌతమ్ గంభీర్ 475, బ్రెండన్ మెకల్లమ్ 411 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచాడు. బౌలర్లలో సునీల్ నరైన్ అత్యధిక వికెట్లు 23 తీశాడు. తర్వాత యుజ్వేంద్ర చాహల్ 19, ఆర్. వినయ్ కుమార్ 17, వరుణ్ చకరవర్తి 13 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బెంగుళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో పదో మ్యాచ్‌లో ఇరు జట్లు చివరి సారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. బెంగళూరులో తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో మొత్తం 182/6 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 83* పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 50, సునీల్ నరైన్ 22 బంతుల్లో 47 పరుగులు చేయడంతో కోల్‌కత్తా విజయం సాధించింది.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, రఘువంశీ, రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబుర్ రెహమాన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ దీప్, ఆకాశ్‌కుమార్, వైషక్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కుర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.