IPL 2024: రికార్డుల సమమా, కోల్‌కత్తా ఆధిపత్యమా?
IPL 2024 GT vs KKR: ఇప్పటివరకూ ఐపీఎల్‌లో గుజరాత్-కోల్‌కత్తా మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రెండు మ్యాచుల్లో గుజరాత్ గెలవగా.. కోల్‌కత్తా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.
GT vs KKR Match Head to Head records: ఐపీఎల్ (IPL)2024లో 63వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT VS KKR) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. గత రెండు సీజన్‌లలో వరుసగా ఫైనల్స్‌కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ సీజన్‌లో గుజరాత్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్.. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయాల తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. మరోవైపు ఈ సీజన్‌లో కోల్‌కతా అద్భుత ఫామ్‌లో ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో గుజరాత్-కోల్‌కత్తా మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రెండు మ్యాచుల్లో గుజరాత్ గెలవగా.. కోల్‌కత్తా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. 2022 సీజన్‌లో గుజరాత్ ఎనిమిది పరుగులతే తేడాతో గెలవగా.... 2023 సీజన్‌లో మళ్లీ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అదే సీజన్‌లో కోల్‌కత్తా మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రెండు జట్లు ఒకేసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించింది.
పిచ్ రిపోర్ట్
అహ్మదాబాద్‌లోని ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలను అందిస్తుంది. గత మ్యాచ్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఈ వేదికపైనే గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో మెరిశారు.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), KS భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, వరుణ్‌దీప్, రమణదీప్, చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, అల్లా గజన్ఫర్, ఫిల్ సాల్ట్.
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్, శరత్.