IPL 2023: పాయింట్స్ టేబుల్ మ్యాజిక్! RR ప్లేస్‌లో చెన్నై, RCB స్థానంలో ముంబయి!
IPL 2023: ఐపీఎల్ అంటేనే ఎక్స్‌పెక్ట్ ది అన్ ఎక్స్‌పెక్టెడ్! 2022, 2023 ప్లేఆఫ్ చేరిన జట్లే ఇందుకు ఉదాహరణ! అప్పటికీ ఇప్పటికీ కొన్ని ఇంట్రెస్టింగ్ తేడాలు, సారూప్యతలూ ఉన్నాయి! అవేంటంటే!
IPL 2023, GT vs CSK:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఎక్స్‌పెక్ట్ ది అన్ ఎక్స్‌పెక్టెడ్! టీ20 క్రికెట్ అంటేనే ఓ ఫన్నీ గేమ్! ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏవీ ఎవరి కంట్రోల్లో ఉండవు. 2022, 2023 ప్లేఆఫ్ చేరిన జట్లే ఇందుకు ఉదాహరణ! అప్పటికీ ఇప్పటికీ కొన్ని ఇంట్రెస్టింగ్ తేడాలు, సారూప్యతలూ ఉన్నాయి! అవేంటంటే!
గతేడాది నుంచీ ఐపీఎల్ 10 జట్లతో జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ కొత్తగా వచ్చి చేరాయి. దాంతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారింది. మ్యాచుల సంఖ్య పెరిగింది. అలాగే ఈ రెండు జట్లూ అదరగొడుతున్నాయి.
చివరి సీజన్లో గుజరాత్ టైటాన్స్ నంబర్ వన్‌గా నిలిచింది. 14 మ్యాచుల్లో 10 గెలిచి 20 పాయింట్లు సాధించింది. ఈసారీ అలాగే చేసింది. 14 మ్యాచుల్లో 10 గెలిచి 20 పాయింట్లతో నంబర్ వన్ పొజిషన్‌కు వెళ్లింది. రన్‌రేట్ ఇంచుమించు అలాగే మెయింటేన్ చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) ఈ రెండు సీజన్లలోనూ ఒకేలాంటి ప్రదర్శన చేసింది. మూడో స్థానంలోనే నిలిచింది. రెండో ప్లేస్‌లోని జట్టుతో సమానంగా పాయింట్లు గెల్చుకున్నా నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో వెనకబడింది. క్వాలిఫయర్ వన్ ఆడే ఛాన్స్ మిస్ చేసుకుంది.
గతేడాది లక్నో 14 మ్యాచుల్లో 8 గెలిచి 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అప్పుడు రాజస్థాన్ కూడా 18 పాయింట్లే సాధించి రెండుకు పరిమితమైంది. ఈసారి రాజస్థాన్ (Rajasthan Royals) ప్లేస్‌ను చెన్నై తీసుకుంది. 17 పాయింట్లు సాధించింది. లక్నోవీ 17 పాయింట్లే అన్న సంగతి మరవొద్దు.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings) పోయినేడాది తొమ్మిదో స్థానంలో నిలిచింది. జస్ట్ 4 విజయాలే అందుకుంది. ఇప్పుడేమో ఏకంగా రెండో స్థానానికి జంప్ చేసింది. ముంబయి ఇండియన్స్ అప్పుడు 8 పాయింట్లతో ఆఖర్లో నిలిచింది. ఇప్పుడేమో 16 పాయింట్లతో నాలుగో స్థానానికి వచ్చింది.
Also Read: ఐపీఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్ ఇదే! మొదట ఫైనల్ చేరే టీమ్‌ను డిసైడ్ చేసేదీ మంగళవారమే!
కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight riders) అప్పుడూ ఇప్పుడూ ఒకే స్థానంలో నిలిచింది. 2022లో 14 మ్యాచుల్లో 6 గెలిచింది. ఇప్పుడూ ఇదే ఫాలో అయింది. అన్నే పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. అయితే రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్ చేరేందుకు గట్టి పోటీనిచ్చింది.
చివరి సీజన్లో 2, 4లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royala Challengers Bangalore) ఈసారి 5, 6 స్థానాల్లో నిలిచాయి. ఏడు మ్యాచులు గెలిచి ఏడు ఓడి 14 పాయింట్లకు పరిమితం అయ్యాయి. నెట్‌రన్‌రేట్ ఒక్కటే తేడా.
గతేడాది 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad). ఇప్పుడు ఇంకా ఘోరమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. 14 మ్యాచుల్లో కేవలం 4 గెలిచి 8 పాయింట్లతో ఆఖర్లో నిలిచింది.
పంజాబ్ కింగ్స్ (Punjab Kings) గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. చివరి సీజన్లో 6 మ్యాచులు గెలిచి 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి ఇంకో మ్యాచ్ ఒకటి ఎక్కువ గెలిచి 14 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది.
.@ybj_19 tops the Fantasy Charts with 1197 points at the end of Match 7️⃣0️⃣ of #TATAIPL 2023 👏🏻👏🏻
— IndianPremierLeague (@IPL) May 21, 2023
How many among these did you have in your Fantasy Team 🤔🤔
Visit https://t.co/C4oa4xTCN1 to make your Fantasy Team now! pic.twitter.com/Ck34zgLdNv
At the end of group stage of #TATAIPL 2023, @faf1307 dons the @aramco Orange cap after Match 7️⃣0️⃣ of #TATAIPL 2023 🙌
— IndianPremierLeague (@IPL) May 21, 2023
Meanwhile Mohd. Shami is leading the wicket-tally & is the @aramco Purple Cap holder 👏 pic.twitter.com/oMpMxl6EtS