By: ABP Desam | Updated at : 09 Apr 2023 09:42 AM (IST)
మైదానంలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు (ఫైల్ ఫొటో)
IPL 2023 SRH vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో 14వ మ్యాచ్ ఏప్రిల్ 9వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ కింగ్స్‌లో ఉత్సాహం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో శిఖర్ ధావన్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకుంటోంది. పంజాబ్ కింగ్స్ తన మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఐదు పరుగుల తేడాతో చిత్తు చేసింది.
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల ఖాతా తెరవలేదు. హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంది. ఇక్కడ బంతి సులభంగా బ్యాట్‌పైకి వస్తుంది. బ్యాట్స్‌మన్ దానిని కావలసిన ప్రాంతంలోకి ఆడగలరు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు ఇక్కడ ప్రభావవంతంగా రాణిస్తారు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, T నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, శామ్ కరన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఫలితం ఎలా ఉండవచ్చు?
ఐపీఎల్ 2023లో ఇరు జట్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ విజయాల ఖాతా ఇంకా తెరవలేదు. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడింది. రెండిట్లోనూ విజయం సాధించింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో సరైన కాంబినేషన్‌ను ఎంచుకోవడం సన్‌రైజర్స్‌కు సవాలుగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు గెలవగలదు.
🧡⚔️❤️
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2023
Geared up for a Sunday night blockbuster 🤩@AidzMarkram | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #SRHvPBKS pic.twitter.com/JDpeZRvAga
Back to home 🏠🧡
— SunRisers Hyderabad (@SunRisers) April 8, 2023
We meet PBKS in our next clash 🔥#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #SRHvPBKS pic.twitter.com/YScWmmSktl
Touchdown Hyderabad 📍🏠#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #SRHvPBKS pic.twitter.com/7ygrqYfJWd
— SunRisers Hyderabad (@SunRisers) April 8, 2023
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!