News
News
వీడియోలు ఆటలు
X

SRH vs RCB: సన్‌రైజర్స్‌ గెలిస్తే..! ఈ సాలా కప్‌ వేరే వాళ్లదే 'ఆర్సీబీ'!

SRH vs RCB, IPL 2023: ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, బెంగళూరు (SRH vs RCB) తలపడుతున్నాయి. ప్రతిష్ఠ కోసం రైజర్స్‌ ఆడుతుండగా ప్లేఆఫ్‌ చేరేందుకు ఆర్సీబీ పట్టుదలగా ఉంది. మరి ఇందులో గెలుపెవరిది!

FOLLOW US: 
Share:

SRH vs RCB, IPL 2023: 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో నేడు 65వ మ్యాచ్‌ జరుగుతోంది. ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (SRH vs RCB) తలపడుతున్నాయి. ప్రతిష్ఠ కోసం రైజర్స్‌ ఆడుతుండగా ప్లేఆఫ్‌ చేరేందుకు ఆర్సీబీ పట్టుదలగా ఉంది. మరి ఇందులో గెలుపెవరిది!

ఫ్రెండ్లీ గేమ్‌!

ఐపీఎల్‌ 2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) అనుకున్నదొక్కటి! అయినది మరొకటి! టీ20 క్రికెట్‌కు నప్పే ఆటగాళ్లను కొనుగోలు చేసినా ఫలితం దక్కలేదు. కోట్టు పెట్టి కొనుకున్న క్రికెటర్లు అస్సలు రాణించలేదు. హెన్రిచ్‌ క్లాసెన్‌ ఒక్కడే టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. అదీ 170 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. మిగిలిన ఆటగాళ్లు ఒక్కరంటే ఒక్కరూ అంచనాలను అందుకోలేదు. ఇప్పటికీ ఓపెనింగ్‌ పెయిర్‌ కుదర్లేదు. అభిషేక్‌, మయాంక్‌ రాణించడం లేదు. రాహుల్‌ త్రిపాఠి పదేపదే విఫలమవుతున్నాడు. నిలకడ కోల్పోయాడు. కెప్టెన్‌ అయిడెన్‌ మార్‌క్రమ్‌ ఎప్పుడు ఆడతాడో తెలియదు. 8 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్‌ గెలిచినా.. ఓడినా పెద్దగా ఫరక్‌ పడదు! భువనేశ్వర్‌, మయాంక్‌ మర్కండే బంతితో ఫామ్‌లో ఉండటం కాస్త పాజిటివ్‌ అంశం. నటరాజన్‌, ఫారూఖీ, ఎన్‌సన్‌ బౌలింగ్‌లో పస చూపించడం లేదు. సొంత గ్రౌండ్లో ఆర్సీబీపై మంచి రికార్డు ఉండటం ఒక్కటే గుడ్‌న్యూస్‌!

ఓడితే.. ఇంటికే!

రాజస్థాన్‌ రాయల్స్‌పై అద్భుతమైన విజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. వరుసగా రెండు మ్యాచులు గెలిస్తే 16 పాయింట్లతో నాకౌట్‌కు వెళ్లొచ్చు. అయితే హైదరాబాద్‌ చేతిలో ఓడితే ఇక అంతే సంగతులు! మిగతా వాళ్లపై ఆధారపడాల్సి ఉంటుంది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ సూపర్‌ డూపర్ ఫామ్‌లో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ అతడికి అండగా ఉంటున్నాడు. మ్యాడ్‌ మాక్సీ భీకరమైన షాట్లు ఆడుతున్నాడు. అమేజింగ్‌ బ్యాటింగ్‌ స్కిల్స్‌ ప్రదర్శిస్తున్నాడు. మహిపాల్‌ లోమ్రర్‌, దినేశ్‌ కార్తీక్‌, బ్రాస్‌వెల్‌, అనుజ్‌ రావత్‌ మరింత రాణించాలి. కేజీఎఫ్ త్రయం ఔటైతే ఆర్సీబీ పని ముగిసినట్టే! ఈ సీజన్లో బౌలింగ్‌ మాత్రం అదుర్స్‌! చివరి మ్యాచులో హసరంగ, హేజిల్‌వుడ్‌ లేకున్నా రాజస్థాన్‌ను 70 లోపే ఔట్‌ చేశారు. వేన్‌ పర్నెల్‌ చుక్కలు చూపించాడు. మహ్మద్ సిరాజ్ ప్రతి మ్యాచులో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఉప్పల్‌ స్టేడియం అతడికి కొట్టిన పిండి! స్పిన్నర్‌ కరణ్ శర్మకూ ఇక్కడ అనుభవం ఉంది. ఉప్పల్‌లో ఆర్సీబీపై 6-1 తేడాతో సన్‌రైజర్స్‌దే పైచేయి! లక్కు కలిసి రాకుంటే ఆర్సీబీని సన్‌రైజర్స్‌ మడత పెట్టేస్తారు!

Also Read: ఢిల్లీ కోచ్‌గా అతడే కరెక్ట్ - క్యాపిటల్స్ రాత మార్చుతాడంటున్న పఠాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ,  రీస్ టాప్లీ.

Published at : 18 May 2023 12:58 PM (IST) Tags: Sunrisers Hyderabad IPL 2023 Aiden Markram Royal Challengers Bangalore SRH vs RCB Duplesis

సంబంధిత కథనాలు

Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య

Hardik Pandya on MS Dhoni: సీఎస్కే గెలుపు రాసిపెట్టుంది! ధోనీ చేతుల్లో ఓడిపోవడమూ హ్యాపీనే - పాండ్య

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

టాప్ స్టోరీస్

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?