(Source: Poll of Polls)
Mumbai Indians: బుమ్రాకు రిప్లేస్‌మెంట్‌గా కేకేఆర్ పేసర్! ప్రకటించిన ముంబయి!
Sandeep Warrier: తమిళనాడు పేసర్ సందీప్ వారియర్‌తో ముంబయి ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అతడిని తీసుకుంది.
Mumbai Indians, IPL 2023:
తమిళనాడు పేసర్ సందీప్ వారియర్‌తో ముంబయి ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అతడిని తీసుకుంది. దిల్లీ క్యాపిటల్స్ సైతం రిషభ్ పంత్‌కు రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించింది. బెంగాల్ కుర్రాడు, వికెట్‌కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్‌ను ఎంచుకుంది.
టీమ్‌ఇండియా తరఫున సందీప్ వారియర్ ఒక టీ20 ఆడాడు. 2021లో కొలంబోలో శ్రీలంకపై మూడు ఓవర్లు వేశాడు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో రిప్రెజెంట్ చేసే అవకాశం రాలేదు. అయితే టీ20ల్లో మాత్రం మంచి అనుభవమే ఉంది. మొత్తంగా 68 టీ20లు ఆడి 62 వికెట్లు పడగొట్టాడు. 27.48 సగటు, 7.20 ఎకానమీ నమోదు చేశాడు. 3/19 బెస్ట్. అప్పుడప్పుడు బ్యాటుతో పరుగులూ చేయగలడు. సందీప్ వారియర్ మూడుళ్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బృందంలో ఉన్నాడు. ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశమైతే రాలేదు. 2019లో 3 మ్యాచులు, 2020, 21లో ఒక్కో మ్యాచ్ ఆడి మొత్తం 2 వికెట్లు తీశాడు.
టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఈ మధ్యే శస్త్రచికిత్స పూర్తైంది! న్యూజిలాండ్‌లోని ఓ స్పెషలిస్టు వద్ద అతడు వెన్నెముకకు సర్జరీ చేయించుకున్నాడని తెలిసింది. అతడు కోలుకొనేందుకు ఆరు నెలల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాల సమాచారం. బహుశా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండొచ్చు.
మార్చి నెల మొత్తం బుమ్రా (Jasprit Bumrah) న్యూజిలాండ్‌లోనే ఉంటాడని తెలిసింది. అతనెప్పుడు తిరిగి రావాలో, ఎప్పుడు రిహాబిలిటేషన్‌కు వెళ్లాలో బీసీసీఐ (BCCI) వైద్య నిపుణుల బృందం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆగస్టులో పేసుగుర్రం తిరిగి బౌలింగ్ శిక్షణ పొందుతాడు. ఆ తర్వాత మెల్లగా అతడి పనిభారాన్ని పెంచుతారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధం చేస్తారు.
గతేడాది సెప్టెంబర్ నుంచి జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ ఆడలేదు. వెన్నెముక దిగువన నొప్పి రావడంతో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అప్పట్నుంచీ విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో పునరాగమనం చేసేందుకు బలంగా ప్రయత్నించాడు. శ్రీలంక సిరీసుకూ ఎంపికయ్యాడు. అయితే వెన్నెముకలో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడంతో తప్పించారు.
సర్జరీ కావడంతో ఈ ఏడాది ఐపీఎల్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఆసియాకప్‌నకు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. బీసీసీఐ వైద్య బృందం యుద్ధ ప్రాతిపదికన బుమ్రా కేసును పర్యవేక్షించినట్టు తెలిసింది. దాంతో బీసీసీఐ, ఎన్‌సీఏ సమన్వయంతో శస్త్రచికిత్సకు నిర్ణయం తీసుకున్నారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ మ్యాచ్ తన మొదటి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌తో తమ ఐపీఎల్ పోటీని ప్రారంభించనుంది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ తన రెండో మ్యాచ్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మూడో మ్యాచ్ ఆడనుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది.