News
News
వీడియోలు ఆటలు
X

Rohit Sharma, IPL 2023: ముంబయి ఇండియన్స్ 'స్క్రాపీ టీమ్‌'! అయినా గర్వంగా ఉందన్న రోహిత్‌!

Rohit Sharma, IPL 2023: ముంబయి ఇండియన్స్‌ను చూసి గర్విస్తున్నానని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంటున్నాడు. గతేడాది చివరి ప్లేస్‌తో ముగించిన తాము.. ఇప్పుడు క్వాలిఫయర్‌-2కు చేరుకోవడం ఆనందంగా ఉందన్నాడు.

FOLLOW US: 
Share:

Rohit Sharma, IPL 2023: 

ముంబయి ఇండియన్స్‌ను చూసి గర్విస్తున్నానని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంటున్నాడు. ఆటగాళ్లను ఎంతగానో ప్రశంసించాడు. గతేడాది చివరి ప్లేస్‌తో ముగించిన తాము.. ఇప్పుడు క్వాలిఫయర్‌-2కు చేరుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఆకాశ్‌ మధ్వాల్‌, నేహాల్‌ వధేరా స్పెషల్‌ కుర్రాళ్లని మెచ్చుకున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించాక మీడియాతో మాట్లాడాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL) అత్యంత విజయవంతమైన టీమ్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians). ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ గెలిచింది. అయితే సరైన ఆటగాళ్లు లేకపోవడంతో చివరి సీజన్లో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ సారీ అలాగే కనిపించింది. జస్ప్రీత్‌ బుమ్రా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్‌ వచ్చినా ఆడింది ఐదు మ్యాచులే. మళ్లీ మోచేతి గాయంతో ఇంగ్లాండ్‌ వెళ్లిపోయాడు. జే రిచర్డ్సన్‌ సైతం అందుబాటులో లేడు. ఒకట్రెండు మ్యాచులకు తిలక్‌ వర్మ అందుబాటులో లేడు. అయినప్పటికీ ముంబయి రెండో క్వాలిఫయర్‌కు చేరుకోవడం ప్రత్యేకం.

లీగ్‌ ఆరంభంలో వరుస మ్యాచుల్లో ఓడిపోయినప్పుడు ప్లేఆఫ్స్‌ గురించి ఆలోచించామని రోహిత్ శర్మ (Rohit sharma) అంటున్నాడు. 'అవును, ప్లేఆఫ్‌కు చేరుకుంటామో లేదో అనిపించింది. అయితే అన్ని అడ్డంకుల్ని అధిగమించాం. ఆటగాళ్లను చక్కగా మేనేజ్‌ చేశాం. చివరి సీజన్‌తో పోలిస్తే చాలా మెరుగవ్వాలని అనుకున్నాం. ఇందుకోసం బాగా కష్టపడాల్సి ఉంటుందని తెలుసు. అన్ని అడ్డంకుల్నీ ఎదుర్కొన్నాం. ఒక్కోసారి ప్లాఫ్ అవ్వొచ్చు. దానికీ సిద్ధంగా ఉన్నాను' అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు.

ఎవరికీ తెలియని కుర్రాళ్లు ఇంతలా మెరుస్తున్నారంటే ముంబయి ఇండియన్స్‌ స్కౌటింగ్‌ బృందమే కారణమని రోహిత్‌ వివరించాడు. నేహాల్‌ వధేరా, ఆకాశ్ మధ్వాల్‌ మ్యాచ్‌ విన్నర్లుగా అవతరించారని ప్రశంసించాడు. వాళ్లను కంఫర్టబుల్‌గా ఉంచాల్సిన బాధ్యత కెప్టెన్‌గా తనపైనే ఉంటుందన్నాడు. 'ముందు కుర్రాళ్లను సౌకర్యంగా ఉంచాలి. జట్టులో భాగంగా మార్చాలి. వారికి దేశవాళీ క్రికెట్లో మంచి అనుభవం ఉంది. అయితే ఐపీఎల్‌ భిన్నమైంది. చాలా ప్రెజర్‌ ఉంటుంది. వారు ప్రణాళికలను సరిగ్గా అమలు చేసేందుకు కెప్టెన్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ ఎంతో కష్టపడతారు. వాళ్ల పాత్రలను స్పష్టంగా వివరిస్తే ఆడటం సులభం అవుతుంది' అని హిట్‌మ్యాన్‌ వెల్లడించాడు.

వాంఖడే వంటి స్టేడియాల్లో ఒకరిద్దరు ఆటగాళ్లు ఆడితే సరిపోతుందని రోహిత్‌ శర్మ చెప్పాడు. చెన్నై లాంటి పిచ్‌లపై ప్రతి ఒక్కరూ రాణించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. 'చిదంబరంలో మమ్మల్ని ఒక్కరే గెలిపించలేరని తెలుసు. అందుకే జట్టుగా పోరాడాలి. ఇలాంటి కండీషన్స్‌లో ఏదో ఒక దశలో అందరూ రాణించాలి. ఆకాశ్ మధ్వాల్‌ చివరి సీజన్లో సపోర్ట్‌ బౌలర్‌గా ఉన్నాడు. ఆడే అవకాశం రాలేదు. జోఫ్రా వెళ్లిపోవడంతో ఇంకొకరు కావాల్సి వచ్చింది. మధ్వాల్‌ ఎంతో తెలివైన వాడు. మంచి నైపుణ్యాలు ఉన్నాయి. అందుకే అతడిపై కాన్ఫిడెన్స్‌ ఉంది. లక్నోపై అతడి ప్రదర్శన అమోఘం' అని మెచ్చుకున్నాడు.

Lucknow Super Giants vs Mumbai Indians Eliminator: ఐపీఎల్‌ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.

Published at : 25 May 2023 12:52 PM (IST) Tags: Mumbai Indians IPL 2023 Rohit sharma LSG vs MI

సంబంధిత కథనాలు

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!

IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!