By: ABP Desam | Updated at : 23 May 2023 03:00 PM (IST)
విరాట్ కోహ్లీ ( Image Source : Twitter, RCB )
Virat Kohli, IPL 2023:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తన జట్టును ప్లేఆఫ్ చేర్చలేకపోయినందుకు బాధపడుతున్నాడు. లక్ష్యానికి కాస్త దూరంలో ఆగిపోయామని, మళ్లీ ఘనంగా తిరిగొస్తామని పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం పెట్టాడు.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers Banalore) ప్రస్థానం లీగ్ దశతోనే ముగిసింది. మరోసారీ అభిమానులను నిరాశపరిచింది. ఆఖరి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో ప్లేఆఫ్‌కు దూరమైంది. వరుసగా పదహారో సీజన్లోనూ నిరాశగా వెనుదిరిగింది. దాంతో అభిమానులను ఊరడించేందుకు కోహ్లీ (Virat Kohli) సహా ఇతర ఆర్సీబీ క్రికెటర్లు సోషల్ మీడియాలో సందేశాలు పోస్టు చేస్తున్నారు.
'ఈ సీజన్లో మాకు మంచి మూమెంటమ్ లభించింది. కానీ దురదృష్టవశాత్తు లక్ష్యానికి కాస్త దూరంలో ఆగిపోయాం. నిరాశపరిచాం. ఏదేమైనా మనం తలెత్తుకొని నిలబడాల్సిన తరుణం ఇది. మా ప్రయాణంలో ప్రతి దశలోనూ అభిమానులు, సపోర్టర్స్ మాకు అండగా నిలబడ్డారు. మా కోచింగ్ బృందం, మేనేజ్‌మెంట్, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు. మేం మళ్లీ ఘనంగా తిరిగొస్తాం' అని విరాట్ కోహ్లీ పోస్టు చేశాడు.
We couldn’t live up to the expectations and the results didn’t go our way. The chase for the dream shall continue….
— DK (@DineshKarthik) May 23, 2023
Thanks to all the fans who stand tall with the us through thick and thin…you mean the world to us always! ❤️#RCB #PlayBold #Classof2023 #IPL2023 pic.twitter.com/SRAb52yxXA
ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సైతం ఇలాంటి మెసేజే ఇచ్చాడు. 'మేం అంచనాల మేరకు రాణించలేదు. ఫలితాలు మాకు అనకూలంగా రాలేదు. ట్రోఫీ కోసం మా పరుగు ఇంకా కొనసాగుతూనే ఉంది. గెలిచినా, ఓడినా మాకు అండగా నిలబడ్డ అభిమానులకు ధన్యవాదాలు. మాకెప్పుడూ మీరే ప్రాణం' అని డీకే అన్నాడు.
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోస్తరు ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలబడింది. 14 మ్యాచుల్లో 7 గెలిచి 7 ఓడింది. 0.135 రన్‌రేట్, 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు దూరమైంది. అయితే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం అదరగొట్టారు. ఇప్పటి వరకైతే పరుగుల పరంగా టాప్-3లో నిలిచారు.
Deepest gratitude to our incredible fans for standing by us through every cheer and challenge this season.
— Royal Challengers Bangalore (@RCBTweets) May 22, 2023
No matter the ground, the weather or the result, your unwavering support has been our greatest strength.
We carry your passion and love within our hearts. Thank you for… pic.twitter.com/40i6m1pgdz
ముఖ్యంగా కింగ్ కోహ్లీ 14 మ్యాచుల్లో 139.82 స్ట్రైక్‌రేట్‌తో 639 పరుగులు చేశాడు. ఏకంగా రెండు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కొట్టేశాడు. 65 బౌండరీలు, 16 సిక్సర్లు బాదాడు. ఇక డుప్లెసిస్ 153.68 స్ట్రైక్‌రేట్, 56.15 సగటుతో 730 పరుగులు చేశాడు. 8 హాఫ్ సెంచరీలు, 60 బౌండరీలు, 36 సిక్సర్లు బాదాడు.
We thank each and every member of RCB for putting in tireless efforts and for staying committed to Playing Bold on and off the field. 🙌
— Royal Challengers Bangalore (@RCBTweets) May 23, 2023
We’ll continue to get better and come back stronger to entertain our lovely fans.
Thank you, #ClassOf2023! ❤️#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/sAmnEMwlAN
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!
Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు - ఒక ఐపీఎల్ సీజన్‌లో అంత దారుణంగా!
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!