By: Rama Krishna Paladi | Updated at : 20 Apr 2023 03:22 PM (IST)
పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Image Source : Twitter, Jio Cinema )
PBKS vs RCB, IPL 2023:
మొహాలి వేదికగా పంజాబ్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శామ్ కరణ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శిఖర్ ధావన్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని చెప్పాడు. లియామ్ లివింగ్‌స్టోన్ వచ్చేశాడని వెల్లడించాడు. ఫాఫ్ డుప్లెసిస్ పూర్తి ఫిట్‌నెస్ లేకపోవడంతో ఈ మ్యాచులో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తున్నాడు. డుప్లెసిస్ ఇంప్టాక్ ప్లేయర్‌గా ఉంటాడని పేర్కొన్నాడు.
Take a look at the Playing XIs in the #PBKSvRCB contest 👌👌
— IndianPremierLeague (@IPL) April 20, 2023
What do you make of the two sides 🤔
Follow the match ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL pic.twitter.com/BLQMWfhKIt
'మేం తొలుత బౌలింగ్ చేస్తాం. చివరి మ్యాచులో బాగా ఆడాం. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం. ఇక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదు. శిఖర్ ధావన్ మెరుగవుతున్నాడు. కానీ ఈ రోజు ఆడటం లేదు. అతనో నాణ్యమైన ఆటగాడు. కుర్రాళ్లు మరింత పరిణతి సాధించాలి. లివింగ్‌స్టోన్ పునరాగమనం చేస్తున్నాడు. కాగిసో రబాడ ప్లేస్‌లో నేథన్ ఎలిస్ ఆడుతున్నాడు' అని పంజాబ్ కెప్టెన్ శామ్ కరణ్ అన్నాడు.
'డుప్లెసిస్ ఈ రోజు ఫీల్డింగ్ చేసే పరిస్థితుల్లో లేడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంటాడు. వైశాక్ బదులు వస్తున్నాడు. మేం అనుకున్నదే చేస్తున్నాం. మేమెలాగైనా తొలుత బ్యాటింగే చేయాలనుకున్నాం. పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది. బౌలర్లు గేమ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్లగలరు. ఒకసారికి ఒక మ్యాచ్ పైనే ఫోకస్ చేస్తున్నాం. సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇంకా రాణించాల్సి ఉంది. జట్టులో ఇంకేం మార్పుల్లేవ్' అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
పంజాబ్ కింగ్స్: అథర్వ తైడె, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కరణ్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నేథన్ ఎలిస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మహిపాల్ లోమ్రర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, సుయాశ్ ప్రభుదేశాయ్, హర్షల్ పటేల్, వేన్ పర్నెల్, మహ్మద్ సిరాజ్
🚨 Toss Update 🚨@PunjabKingsIPL win the toss and elect to field first against @RCBTweets.@CurranSM & @imVkohli are leading their respective sides today.
— IndianPremierLeague (@IPL) April 20, 2023
Follow the match ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/ITFDTd7ObP
Match Mode 🔛@imVkohli 🤝 @liaml4893 #TATAIPL | #PBKSvRCB pic.twitter.com/EMyu6IcOui
— IndianPremierLeague (@IPL) April 20, 2023
Hello from Mohali 🏟️👋@PunjabKingsIPL 🆚 @RCBTweets
— IndianPremierLeague (@IPL) April 20, 2023
Who's winning the first game of today's double-header? ☀️#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/hD8UNfMMPM
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!
IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!
ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి