IPL 2023, PBKS vs LSG: 40 ఓవర్లలో 458 రన్స్ - 56 తేడాతో పంజాబ్‌పై లక్నో 'జెయింట్' విక్టరీ!
IPL 2023, PBKS vs LSG: మొహాలిలో దివాలీ జరిగింది! అభిమానులు 40 ఓవర్లూ రన్ ఫెస్ట్‌ను వీక్షించారు. .తొలి మ్యాచ్ ఓటమికి పంజాబ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.
IPL 2023, PBKS vs LSG:
మొహాలిలో దివాలీ జరిగింది! అభిమానులు 40 ఓవర్లూ రన్ ఫెస్ట్‌ను వీక్షించారు. స్టాండ్స్‌లో పడుతున్న బంతులను ఫీల్డర్లకు ఇస్తూ ఆనందించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎగిరి గంతులేశారు! ఎందుకంటే పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ అలా సాగింది మరి! 239 బంతుల్లోనే 458 పరుగులు చేశారు బ్యాటర్లు! అయితే లక్నో మాత్రం అమేజింగ్ విక్టరీ సాధించింది. తొలి మ్యాచ్ ఓటమికి పంజాబ్‌పై ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.
రన్ ఫెస్ట్!
ఐపీఎల్ చరిత్రలోనే రెండో హయ్యస్ట్ టార్గెట్ 259 ఛేజింగ్‌కు దిగిన పంజాబ్‌ను కేఎల్ రాహుల్ సేన చిత్తుగా ఓడించింది. 56 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ప్రత్యర్థిని 201కి ఆలౌట్ చేసేసింది. కుర్రాడు అథర్వ టైడె (66; 36 బంతుల్లో 8x4, 2x6) మాత్రం అదరగొట్టాడు. ఛేదనను ఇంట్రెస్టింగ్‌గా మార్చాడు. సికిందర్ రజా (36; 22 బంతుల్లో 4x4, 1x6) అతడికి తోడుగా నిలిచాడు. అంతకు ముందు సూపర్ జెయింట్స్‌లో.. కైల్ మేయర్స్ (54; 24 బంతుల్లో 7x4, 4x6), మార్కస్ స్టాయినిస్ (72; 40 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీలు బాదేశారు. ఆయుష్ బదోనీ (43; 24 బంతుల్లో 3x4, 3x6), నికోలస్ పూరన్ (45; 24 బంతుల్లో 7x4, 1x6) దంచికొట్టారు.
There you go 🙌🙌@LucknowIPL #TATAIPL https://t.co/BtR4cyxldc pic.twitter.com/zna1mhM5YS
— IndianPremierLeague (@IPL) April 28, 2023
అథర్వ.. అదుర్స్!
పంజాబ్ కింగ్స్‌కు ఛేజింగ్ కలిసి రాలేదు. 3 పరుగుల వద్దే కెప్టెన్ శిఖర్ ధావన్ (1)ను మార్కస్ స్టాయినిస్ ఔట్ చేశాడు. మరికాసేపటికే ప్రభుసిమ్రన్ (9)ను నవీన్ ఉల్ హఖ్ పెవిలియన్ పంపించాడు. ఈ సిచ్యువేషన్లో అథర్వ, సికిందర్ రజా నిలబడ్డారు. ఓవర్‌కు పది పరుగుల చొప్పున సాధించారు. పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్‌ను 55/2తో నిలిపారు. మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 78 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరి ఆట చూస్తుంటే కింగ్స్ అద్భుతం ఏమైనా చేయగలదా అనిపించింది! అయితే జట్టు స్కోరు 109 వద్ద రజాను యశ్ ఠాకూర్ ఔట్ చేశాడు. పాండ్య సింపుల్‌గా క్యాచ్ అందుకున్నాడు. మరికాసేపటికే రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అథర్వ.. కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రన్‌రేట్ తగ్గింది. లియామ్ లివింగ్ స్టోన్ (23; 14 బంతుల్లో), సామ్ కరన్ (21; 11 బంతుల్లో) చిన్న చిన్న కేమియోస్ ఆడారు. ఆఖర్లో జితేశ్ (24; 9 బంతుల్లో 3x6) మెరుపులు మెరిపించినా సరిపోలేదు. లక్నోలో 9 మంది బౌలర్లు బౌలింగ్ చేశారు. కెప్టెన్ కేఎల్ రాహుల్, కీపర్ నికోలస్ పూరన్ తప్ప అంతా బంతి పట్టారు. యశ్ ఠాకూర్ 4, నవీన్ ఉల్ హఖ్ 3 వికెట్లు పడగొట్టారు.
దంచుడే.. దంచుడు!
మొహాలిలో డ్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి బంతి నుంచే అటాక్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) త్వరగానే ఔటైనా మిగతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పవర్ ప్లే ముగిసే సరికే లక్నోను 74/2తో నిలిపారు. రాహుల్, మేయర్స్ తొలి వికెట్‌కు 21 బంతుల్లోనే 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 41 వద్ద కేఎల్‌ను రబాడ ఔట్ చేసినా.. మేయర్స్ చుక్కలు చూపించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆయుష్ బదోనీతో కలిసి రెండో వికెట్‌కు 33 (16) పాట్నర్‌షిప్ అందించాడు.
బదోనీ.. బంపర్ హిట్!
పవర్‌ప్లే ఆఖరి బంతికి మేయర్స్‌ను సామ్ కరన్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. కానీ మజిల్ మ్యాన్ మార్కస్ స్టాయినిస్ వెరీ కూల్.. అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు జస్ట్ బ్యాటు అడ్డు పెడితే బంతి స్టాండ్స్‌లోకి వెళ్లింది. బదోనీ సైతం గ్యాప్స్ ఫైండ్ చేసి చక్కని బౌండరీలు బాదేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 47 బంతుల్లో 89 రన్స్ పాట్నర్‌షిప్ అందించారు. 13 ఓవర్ల వరకు వికెట్టే ఇవ్వలేదు. వీరిద్దరి వీర బాదుడుకు 12.2 ఓవర్లకే లక్నో స్కెరు 150కి చేరుకుంది. అయితే 13.3వ బంతికి బదోనీని లివింగ్‌స్టోన్ ఔట్ చేశాడు. కానీ ఆ తర్వాత ఊచకోత మరింత పెరిగింది.
హల్క్.. పూరన్!
31 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన స్టాయినిస్ మరింత దూకుడు పెంచాడు. 15.5 ఓవర్లకే స్కోరును 200 దాటించాడు. నికోలస్ పూరన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 30 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 239 వద్ద స్టాయినిస్‌ను కరన్ ఔట్ చేశాడు. ఆఖర్లో దీపక్ హుడా (11; 6 బంతుల్లో) పూరన్ నాటు ఇన్నింగ్స్ ఆడాడు. 19.2 ఓవర్లకు స్కోరును 250కి చేర్చాడు. ఆర్సీబీ 263 రికార్డ బ్రేక్ అయ్యేలా కనిపించినా.. ఆఖరి ఓవర్లో పూరన్ ఔటవ్వడంతో లక్నో 257కి సెటిల్ అయింది.
Naveen-ul-Haq with his third wicket of the night as Kagiso Rabada is bowled out for a duck.
— IndianPremierLeague (@IPL) April 28, 2023
Live - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/u2bxfvqSpw