LSG vs RCB: డుప్లెసిస్, హర్షల్ పటేల్.. ఇంటర్ ఛేంజ్! ఏకనా పిచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లకు కష్టమే!
LSG vs RCB: ఐపీఎల్ 2023లో సోమవారం లక్నో,బెంగళూరుఢీకొంటున్నాయి. బౌలర్లకు అనుకూలంగా ఉండే ఏకనా స్టేడియం వేదిక. రెండు జట్లకు బలమైన బౌలింగ్ లైనప్ ఉండటంతో తుది జట్లు, ఇంపాక్ట్ ప్లేయర్లపై ఆసక్తి నెలకొంది.
LSG vs RCB, IPL 2023:
ఐపీఎల్ 2023లో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (LSG vs RCB) రెండో మ్యాచులో ఢీకొంటున్నాయి. బౌలర్లకు అనుకూలంగా ఉండే ఏకనా స్టేడియం ఇందుకు వేదిక. రెండు జట్లకు బలమైన బౌలింగ్ లైనప్ ఉండటంతో తుది జట్లు, ఇంపాక్ట్ ప్లేయర్లపై ఆసక్తి నెలకొంది.
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)
తొలుత బ్యాటింగ్ చేస్తే: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, ఆయుష్ బదోనీ, మార్కస్ స్టాయినిస్ / క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, దీపక్ హుడా, నవీన్ ఉల్ హఖ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్
తొలుత బౌలింగ్ చేస్తే: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోనీ, మార్కస్ స్టాయినిస్ / క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, దీపక్ హుడా, నవీన్ ఉల్ హఖ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా.
లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ ఆరంభం నుంచీ ఒకే ఫార్ములా వాడుతోంది. మొదట్లో ఆయుష్ బదోనీ స్థానంలో మిగతా వాళ్లను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొనేది. ఇప్పుడు బదోనీని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటోంది. తొలుత బ్యాటింగ్ చేస్తే కైల్ మేయర్స్ జట్టులో ఉంటాడు. బౌలింగ్ చేసేటప్పుడు అతడి కోటా పూర్తవ్వగానే అమిత్ మిశ్రా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడు. టాస్‌ను బట్టి వీరిద్దరూ మారతారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)
తొలుత బ్యాటింగ్ చేస్తే: విరాట్ కోహ్లీ (కెప్టెన్), డుప్లెసిస్, మహిపాల్ లోమ్రర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగ, విజయ్ కుమార్ వైశాఖ్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
తొలుత బౌలింగ్ చేస్తే: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహిపాల్ లోమ్రర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగ, విజయ్ కుమార్ వైశాఖ్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గాయాలు వేధిస్తున్నాయి. హర్షల్ పటేల్ వేలికి గాయమైంది. డుప్లెసిస్ రిబ్స్ ఇంజూరీ నుంచి పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి వీరిద్దరినే ఇంపాక్ట్ ప్లేయర్లను వాడుకుంటున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తే డుప్లెసిస్‌ను తుది జట్టులోకి తీసుకుంటారు. ఆ తర్వాత హర్షల్ పటేల్ అతడిని రిప్లేస్ చేస్తాడు.
పిచ్ రిపోర్ట్
లక్నోలో మంచు ఎక్కువగా కురవదు. సోమవారమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఏకనా పిచ్‌లు నెమ్మదిగా ఉంటున్నాయి. మందకొడిగా మారుతున్నాయి. కాబట్టి స్పిన్నర్లకు ఎక్కువ అడ్వాండేజీ లభిస్తుంది. ఇక చిన్నస్వామితో పోలిస్తే బౌండరీలు పెద్దవి. క్రీజులో నిలిస్తే బ్యాటర్లు పరుగులు చేస్తారు. సెట్ బ్యాటర్‌తో పోలిస్తే కొత్తగా వచ్చేవాళ్లు ఇబ్బంది పడతారు.
Bowling finesse & Batter's distress! 🎯🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/xyJtE5cjmX
— Royal Challengers Bangalore (@RCBTweets) April 30, 2023
#MondayMotivation: Virat Kohli's contagious cheerful mood! 😄👑#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 @imVkohli pic.twitter.com/w4y4QyKO8n
— Royal Challengers Bangalore (@RCBTweets) May 1, 2023