(Source: ECI/ABP News/ABP Majha)
KKR vs SRH Preview: ఈడెన్‌లో కేకేఆర్‌తో సన్‌రైజర్స్ ఢీ! దక్కేనా రెండో విజయం!
KKR vs SRH Preview: ఇండియన్ ప్రీమియర్ లీగులో శుక్రవారం 19వ మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి.
KKR vs SRH Preview:
ఇండియన్ ప్రీమియర్ లీగులో శుక్రవారం 19వ మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. రీసెంట్ విజయాలతో రెండు జట్లూ జోష్‌లో ఉన్నాయి. మరి నేటి మ్యాచులో విజయం ఎవరిది?
ఈడెన్‌లో కేకేఆర్ డేంజరస్!
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎప్పటికీ డేంజరస్ టీమే! సొంతగడ్డపై దానికి తిరుగుండదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేని లోటును నితీశ్ రాణా తీరుస్తున్నాడు. బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ చక్కని ఫామ్‌లో ఉన్నాడు. యంగ్ అండ్ డైనమిక్ రింకూసింగ్ సిక్సర్లు బాదేస్తూ భయపెడుతున్నాడు. ఓపెనింగ్ పరంగా ఇబ్బందులున్నాయి. స్టాండర్డ్ ఓపెనర్లు లేరు. మిడిలార్డర్లో వెంకీ, రాణా, రింకూ, రసెల్, నరైన్, శార్దూల్ భీకరంగా ఆడగలరు. ఆర్సీబీపై శార్దూల్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో తెలిసిందే. స్పిన్‌లో కేకేఆర్‌కు తిరుగులేదు. మిస్టరీ స్పిన్నర్లు సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వికెట్లు పడగొడుతున్నారు. రెండు ఎండ్స్ నుంచి దాడి చేస్తున్నారు. లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, శార్దూల్‌తో కూడిన పేస్ డిపార్ట్‌మెంట్ మరింత కట్టుదిట్టంగా మారాలి.
లేటుగా ఫామ్‌లోకి సన్‌రైజర్స్!
ఈ సీజన్లో ఆలస్యంగా ఫామ్‌లోకి వచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌ను విలవిల్లాడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటింది. కోట్లు పెట్టిన కొన్న హ్యారీ బ్రూక్స్ ఇంకా తన మెరుపులు చూపించలేదు. మయాంక్ నిలకడగా ఓపెనింగ్స్ ఇస్తున్నాడు. రాహుల్ త్రిపాఠి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సిచ్యువేషన్ డిమాండ్‌ను బట్టి స్లోగా.. అగ్రెసివ్‌గా ఆడుతున్నాడు. కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ రన్స్ చేస్తున్నాడు. హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, జన్‌సెన్, భువీ పరుగులు బాకీ ఉన్నారు. సరైన కండీషన్స్‌లో సన్‌రైజర్స్ బౌలింగ్‌కు ఎదురుండదు. భువీ మునుపటి స్థాయిలో భయపెట్టక పోయినా రన్స్ కంట్రోల్ చేస్తున్నాడు. జన్‌సెన్, మాలిక్, నట్టూ ఫర్వాలేదు. మయాంక్ మర్కండే పంజాబ్‌పై 4 వికెట్లు తీసి జోష్‌లో ఉన్నాడు. సుందర్ అతడికి తోడున్నాడు. పిచ్‌ను బట్టి జన్‌సెన్ స్థానంలో ఆదిల్ రషీద్‌ను తీసుకుంటారు. ఈడెన్ పిచ్‌పై సన్‌రైజర్స్ బౌలింగ్ ఎఫెక్టివ్‌గానే ఉంటుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.