KKR vs SRH: కేకేఆర్‌తో 23 సార్లు సన్‌రైజర్స్ పోటీ! ఎన్ని గెలిచిందంటే? పిచ్ రిపోర్టు ఏంటి?
KKR vs SRH: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం కోసం ఎదురు చూస్తోంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతోంది. మరి వీరిలో ఎవరిపై ఎవరిది ఆధిపత్యం? పిచ్ రిపోర్టు ఏంటంటే?
KKR vs SRH, IPL 2023:
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం కోసం ఎదురు చూస్తోంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతోంది. ఇందుకు వేదిక ఈడెన్ గార్డెన్స్! లీగులో ఈ రెండు జట్లదీ ఆసక్తికర రైవల్రీ! మరి వీరిలో ఎవరిపై ఎవరిది ఆధిపత్యం? పిచ్ రిపోర్టు ఏంటంటే?
The Orange Express has reached the city of Joy 🔥🧡
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2023
Get ready for the Knight Riders X Sunrisers clash y'all 🤩👊@AidzMarkram | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #KKRvSRH pic.twitter.com/oeyJeS334g
రీసెంట్ ఫామ్ కేకేఆర్‌దే!
ఇండియన్ ప్రీమియర్ లీగులో అత్యంత బలమైన జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకటి. రెండుసార్లు ట్రోఫీ గెలిచిందంటే మాటలు కాదు! సొంతగడ్డపై దానికి తిరుగులేదు. ఎంతటి బలమైన ప్రత్యర్థినైనా కకావికలం చేయగలరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరి సారి తలపడ్డ ఐదు మ్యాచుల్లో 3 సార్లు కేకేఆర్ గెలిచింది. సన్‌రైజర్స్ ఒక్కసారే గెలవగా ఒక మ్యాచ్ టై అయింది. 2021లో రెండుసార్లే కేకేఆర్‌నే విజయం వరించింది. 2022లో కేకేఆర్, సన్‌రైజర్స్ ఒక్కోసారి గెలిచాయి.
Okka Adugu ☝️🦶🔥
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2023
Mayank's area lo evaru adugu pettakudadu 💥👊#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #KKRvSRH pic.twitter.com/psBWmHxDtb
సన్ రైజర్స్ ది వెనుకంజే!
హిస్టారికల్‌గా చూసినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచుల్లో కేకేఆర్ విజయ ఢంకా మోగించింది. 8 సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయం వరించింది. ఒక మ్యాచ్ టై అయింది. ఆరెంజ్ ఆర్మీపై కేకేఆర్ విజయాల శాతం 63.04గా ఉంది. ఇక మునుపటి దక్కన్ ఛార్జర్స్ పైనా వారిదే అప్పర్ హ్యాండ్. 9 సార్లు తలపడగా 7 సార్లు కోల్‌కతా, 2 సార్లు డీసీ గెలిచాయి.
ఛేదన సులభం!
ఈడెన్ గార్డెన్ పిచ్ చాలా బాగుంటుంది. చాలా మంది క్రికెటర్లకు ఇది అచ్చొచ్చిన మైదానం. బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సాయపడుతుంది. ఇక్కడ ఛేదన సులభంగా ఉంటుంది. రాత్రి పూట డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ. బంతి గ్రిప్ అవ్వడం కష్టం. అందుకే టాస్ గెలవగానే నేరుగా బౌలింగ్ ఎంచుకుంటారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 79 మ్యాచులు ఆడగా ఛేజింగ్ టీమ్ 47 సార్లు గెలిచింది. టాస్ గెలిచిన జట్టు 55 శాతం గెలిచింది.
Telling Time-ing in 𝘼𝙈 🔥🤩 @AidzMarkram | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #KKRvSRH pic.twitter.com/ku9hVTTlNK
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2023
ఐపీఎల్ 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి విజయాన్ని నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో తమ ఖాతాను తెరిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 144 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలోనే ఛేదించడంతోపాటు నెట్ రన్‌రేట్‌ను కూడా కొంత మెరుగుపరుచుకుంది.
ఇప్పుడు పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇందులో జట్టు నెట్ రన్‌రేట్ -1.502గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవి రెండూ ఇప్పటి వరకు పాయింట్ల ఖాతా తెరవలేకపోయాయి. ముంబై నెట్ రన్‌రేట్ ప్రస్తుతం -1.394 కాగా, ఢిల్లీ రన్‌రేట్ -2.092గా ఉంది.
Mic'd up. Fired up. Fazalhaq 🤩💪
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2023
Catch all the unfiltered action from our fiery #Riser's training sesh 🔥@fazalfarooqi10 | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/8No0WXzLZk