By: ABP Desam | Updated at : 06 Apr 2023 11:58 AM (IST)
Edited By: Ramakrishna Paladi
కోల్‌కతా నైట్‌రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Image Source : Twitter, KKR )
KKR vs RCB, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో గురువారం తొమ్మిదో మ్యాచ్ జరుగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ ఇందుకు వేదిక. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. కేకేఆర్ తొలి గెలుపు కోసం వెయిట్ చేస్తోంది. ముంబయిని ఓడించిన ఆర్సీబీ జోష్‌లో ఉంది. మరి నేటి మ్యాచులో విజయం ఎవరిదంటే?
జోష్‌లో ఆర్సీబీ!
చిన్న స్వామి మైదానం చిన్నది. పైగా బ్యాటింగ్ ట్రాక్! ఇలాంటి పిచ్‌పై ముంబయి ఇండియన్స్‌ను తక్కువ స్కోరుకే కంట్రోల్ చేసింది ఆర్సీబీ! అదీ తక్కువ బౌలింగ్ వనరులతోనే! జోష్ హేజిల్ వుడ్ లేడు. టాప్లీ గాయపడ్డాడు. రజత్ పాటిదార్ దూరమయ్యాడు. అందుకే కేకేఆర్‌తో మ్యాచ్ ఈజీ కాదు! హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ పేస్ బాగుంది. డేవిడ్ విలే వీరికి తోడుగా ఉంటాడు. కెప్టెన్ డుప్లెసిస్, కింగ్ కోహ్లీ సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిదే కంటిన్యూ చేయాలి. అయితే వరుణ్, నరైన్, అనుకుల్ రాయ్ స్పిన్‌తో వీరికి ముప్పే. డుప్లెసిస్, కోహ్లీ, మాక్సీకి వీరికి మంచి రికార్డు లేదు. మిడిలార్డర్ ఎలా ఆడుతుందో చూడాలి.
కేకేఆర్ బోణీ కొట్టేనా!
తొలి మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అచ్చి రాలేదు. టాప్ నుంచి మిడిలార్డర్ వరకు బలహీనంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో జేసన్ రాయ్‌ను తీసుకోవడం మంచిదే. అయితే ఈ మ్యాచుకు అతడు అందుబాటులో ఉండడు. వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్ మినహా ఎవరూ ఫామ్‌లో లేరు. ఓపెనర్లు మణ్‌దీప్ సింగ్, గుర్బాన్ మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇవ్వాలి. అనుకుల్ రాయ్, రాణా, రింకూ సింగ్ బాధ్యతాయుతంగా ఆడాలి. పేస్‌కు సహకరించే ఈడెన్‌లో సౌథీ, రసెల్, శార్దూల్ ఇంపాక్ట్ చూపొచ్చు. పేసర్ లాకీ ఫెర్గూసన్ తోడైతే ఎదురుండదు. బ్యాటింగ్ పిచ్‌లోనే సూపర్ బౌలింగ్ వేసిన ఆర్సీబీ పేసర్లతో కేకేఆర్‌కు డేంజరే!
పిచ్ ఎవరికి అనుకూలం!
ఈడెన్ అంటే గుర్తొచ్చేది ఛేదన! ఇక్కడ రెండో బ్యాటింగ్ సులువుగా ఉంటుంది. డ్యూ ఫాక్టర్ అదనపు ప్రయోజనం కల్పిస్తుంది. పెద్ద బౌండరీలు కావడంతో స్పిన్నర్లూ ప్రభావం చూపిస్తారు. మొదట్లో బంతిని స్వింగ్ చేయొచ్చు. బ్యాటర్లు నిలదొక్కుకుంటే సెంచరీలు కొట్టొచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: జేసన్ రాయ్, నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!