అన్వేషించండి

IPL 2023, GT: టైటాన్స్‌ అంటే టైటానిక్‌లా కాదు! టైటిల్ డిఫెండ్‌ చేసే దమ్మున్న జీటీ!

Gujarat Titans: ఏం ఆటగాళ్లను కొన్నార్రా భయ్‌! అనే స్థాయి నుంచి ఏకంగా టైటిల్‌ విన్నర్‌గా అవతరించింది గుజరాత్ టైటాన్స్‌! టైటిల్‌ డిఫెండ్‌ చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

IPL 2023, GT: 

ఏం ఆటగాళ్లను కొన్నార్రా భయ్‌! ఒక్కరన్నా చెప్పుకోదగ్గట్టే లేరు! అనే స్థాయి నుంచి ఏకంగా టైటిల్‌ విన్నర్‌గా అవతరించింది గుజరాత్ టైటాన్స్‌! అరంగేట్రం సీజన్లోనే అదుర్స్‌ అనిపించింది. ఇప్పుడు మరింత బలమైన జట్టును రూపొందించుకొంది. టైటిల్‌ డిఫెండ్‌ చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరి కొత్త సీజన్లో హార్దిక్‌ సేన ఎలా ఉందంటే?

మరింత బలంగా జీటీ

గతేడాది గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ గెలవడంలో కీలకంగా ఆడింది డేవిడ్‌ మిల్లర్‌! పనైపోయింది... వయసైపోయింది.. స్పిన్నర్లను ఆడలేడన్న విమర్శకుల నోర్లను అతడు గట్టిగా మూయించాడు. కష్టాల్లో పడ్డ ప్రతిసారీ జట్టును ఒడ్డుకు చేర్చాడు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడు. నెదర్లాండ్స్‌తో సిరీస్‌ తర్వాత వస్తాడు. ఏప్రిల్‌ 4న దిల్లీ క్యాపిటల్స్‌పై బరిలోకి దిగుతాడు. ఐర్లాండ్‌ పేసర్‌ జోష్ లిటిల్‌ మే రెండో వారంలో బంగ్లాదేశ్‌ వెళ్తాడు. ఈసారి కేన్‌ విలియమ్సన్‌, ఒడీన్‌ స్మిత్‌, కేఎస్ భరత్‌, శివమ్‌ మావిని గుజరాత్‌ కొనుగోలు చేసింది. ఆటగాళ్లంతా మంచి జోష్‌లో ఉన్నారు.

పెరిగిన ఎక్స్‌పీరియన్స్‌

టైటాన్స్‌ ఇప్పుడు ఇంకా పటిష్ఠంగా మారింది. హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా మరింత అనుభవం, పరిణతి సాధించాడు. తన బౌలింగ్‌ అమ్ముల పొదిలో ఇన్‌స్వింగర్‌ చేర్చుకున్నాడు. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ ఇంటర్నేషనల్‌ కెరీర్లో దూసుకుపోతున్నాడు. పాక్‌ సూపర్‌ లీగులో లోహోర్‌ ఖలందర్స్‌కు రషీద్ ఖాన్‌ ట్రోఫీ అందించాడు. 11 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి డేంజర్‌బెల్స్‌ మోగిస్తున్నాడు. టాప్‌-7 బ్యాటర్లలో లెఫ్ట్‌-రైడ్‌ కాంబినేషన్‌ కుదిరింది. ప్లేయింగ్‌ XIలోకి మాథ్యూవేడ్‌ వస్తే బ్యాటింగ్‌ డెప్త్‌ మరింత పెరుగుతుంది. మహ్మద్ షమి గతేడాది ఎలా బౌలింగ్‌ చేశాడో తెలిసిందే. మొతేరాలో 12 పిచ్‌లు ఉన్నాయి. ప్రత్యర్థి బలాబలాల్ని బట్టి పిచ్‌ను ఎంచుకొనే సౌలభ్యం టైటాన్స్‌ సొంతం. ఇప్పటికే కోచ్‌ నెహ్రా నేతృత్వంలో మూడు ప్రీ సీజన్‌ క్యాంపులు నిర్వహించారు. సెకండ్‌ సీజన్‌ సిండ్రోమ్‌ను దాటేస్తే చాలు!

తిరుగులేని ఫైనల్‌ ఎలెవన్‌

గుజరాత్‌ టైటాన్స్ ఫ్రంట్‌లైన్‌ టీమ్‌ అద్భుతంగా ఉంది. అయితే కేన్‌ విలియమ్స్‌ను మినహాయించి బ్యాకప్‌ ఆటగాళ్లకు ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పోజర్‌ ఎక్కువగా లేదు. మరొక్క ఇండియన్‌ బ్యాటర్‌ ఉండుంటే టైటాన్స్‌ను ఎవ్వరూ ఆపలేరు. ఓపెనర్‌గా సాహా స్థానంలో మాథ్యూ వేడ్‌ వస్తే మూడో స్థానంలో ఆ బ్యాటర్‌ అవసరం ఉంటుంది. ఈ సీజన్లో జీటీకి ప్రయాణ ఇబ్బందులు ఉన్నాయి. మ్యాచ్‌ తర్వాత మ్యాచుకు మైదానం మారాల్సి ఉంది. ఒక మ్యాచ్‌ మొతేరాలో తర్వాతి మ్యాచ్‌ ప్రత్యర్థి హోమ్‌ గ్రౌండ్‌లో ఆడాల్సి ఉంటుంది. ఇది వర్క్‌లోడ్‌ పెంచుతోంది. రాహుల్‌ తెవాతియా, శివమ్‌ మావి, యశ్‌ దయాల్‌, సాయి కిషోర్‌, సాయి సుదర్శన్ వంటి యంగ్‌స్టర్స్ ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారొచ్చు. ఈ సీజన్‌ తొలి మ్యాచులో జీటీ, సీఎస్‌కేతో తలపడుతోంది.

గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget