By: ABP Desam | Updated at : 24 May 2023 08:31 PM (IST)
రుతురాజ్ గైక్వాడ్ (ఫైల్ ఫొటో) ( Image Source : PTI )
Ruturaj Gaikwad Broke Virat Kohli's Record: ఐపీఎల్ 2023 మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మే 23వ తేదీన జరిగింది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై తరపున రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 60 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును గైక్వాడ్ బద్దలు కొట్టాడు.
రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా రుతురాజ్ గైక్వాడ్ అన్ని మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ గుజరాత్‌పై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 69.5 సగటు, 145.5 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. కాగా విరాట్ కోహ్లీ గుజరాత్‌పై మూడు ఇన్నింగ్స్‌లలో 116 సగటు, 138.1 స్ట్రైక్ రేట్‌తో 232 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు.
గుజరాత్‌పై విరాట్ కోహ్లీ కంటే రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువ పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 మొదటి లీగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఇందులో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ గైక్వాడ్ 92 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు గుజరాత్‌పై నాలుగు మ్యాచ్‌ల్లో 73(48), 53(49), 92(50), 60(44) ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఫైనల్ చేరేందుకు గుజరాత్‌కు మరో అవకాశం
చెన్నైతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఓటమిపాలైన గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఈ జట్టు తన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ను మే 26వ తేదీన శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌తో ఏ జట్టు తలపడుతుందో ప్రస్తుతం జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది.
ఐపీఎల్-16 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. స్వంత గ్రౌండ్ (చెపాక్)లో బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు రాణించి ఆ జట్టును ఈ లీగ్‌లో పదోసారి ఫైనల్స్‌కు చేర్చారు. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్.. ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ధోనీ సేన.. 15 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టీమ్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 42, 4 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో రషీద్ ఖాన్ (16 బంతుల్లో 30, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భయపెట్టినా చెన్నై విజయాన్ని ఆపలేకపోయారు. ఈ విజయంతో ధోనీ సేన ఫైనల్‌కు చేరగా గుజరాత్ టైటాన్స్.. ముంబై - లక్నో మధ్య జరిగే మ్యాచ్ లో విజేతతో రెండో క్వాలిఫయర్ (మే 26) ఆడుతుంది.
The Rocket Ninja slashing through! ⚡️🚀#WhistlePodu #Yellove #IPL2023 🦁💛 pic.twitter.com/agtanBg66b
— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 2023
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?