Bhuvneshwar Kumar:గుజరాత్‌పై భువీ ఐదు వికెట్ల ఘనత - ఒకే ఓవర్లో మూడు వికెట్లు కూడా!
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.
Bhuvneshwar Kumar: గుజరాత్ టైటాన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 30 పరుగులకే ఐదుగురు ఆటగాళ్లను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. వృద్ధిమాన్ సాహాతో పాటు, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీలను పెవిలియన్ బాట పట్టించాడు.
భువనేశ్వర్ వేసిన ఓవర్లోనే నూర్ అహ్మద్ రనౌట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ అద్బుతమైన బౌలింగ్ ముందు గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ తడబడుతూ కనిపించారు. గుజరాత్ టైటాన్స్ 15 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు 155 పరుగులు చేసింది. అయితే చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ఏడుగురు అవుటయ్యారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు. ఈ ఓవర్ తొలి బంతికే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన శుభ్ మన్ గిల్... అబ్దుల్ సమద్ చేతికి చిక్కాడు. ఈ ఓవర్ రెండో బంతికే రషీద్ ఖాన్ ఔటయ్యాడు. రషీద్ ఖాన్ క్యాచ్ ను హెన్రిచ్ క్లాసెన్ పట్టాడు.
ఈ ఓవర్ మూడో బంతికి నూర్ అహ్మద్ రనౌట్ అయ్యాడు. నూర్ అహ్మక్‌ను హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్ రనౌట్ చేశారు. భువనేశ్వర్ కుమార్ వేసిన నాలుగో బంతికి దసున్ షనక ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు.
భువనేశ్వర్ కుమార్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతికి మహ్మద్ షమీ అవుటయ్యాడు. మహ్మద్ షమీ ఇచ్చిన క్యాచ్‌ను మార్కో జోన్సన్ క్యాచ్ పట్టాడు. అదే సమయంలో ఈ ఓవర్ చివరి బంతికి గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ గిల్ పూర్తి చేశారు. అంటే భువనేశ్వర్ కుమార్ వేసిన 20వ ఓవర్లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ కేవలం 2 పరుగులే చేయగలిగారు. కాగా ఈ ఓవర్లో నలుగురు ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేయగలిగింది. అయితే ఒకానొక సమయంలో హార్దిక్ పాండ్యా సేన 200 పరుగుల మార్కును ఈజీగా దాటుతుందని అనిపించింది. కానీ చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ కుప్పకూలింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరస్ట్ సీజన్లలో ఒకటిగా 2023 నిలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రైజర్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వకుండా ఇంటి బాట పట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 34 పరుగులతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (101: 58 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో గిల్‌కు ఇదే మొదటి సెంచరీ. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (64: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (27: 26 బంతుల్లో, మూడు ఫోర్లు), మయాంక్ మార్కండే (18: 9 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కొంచెం ప్రయత్నించారు. మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా దారుణంగా విఫలం అయింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు దక్కాయి.