By: ABP Desam | Updated at : 30 Apr 2023 11:39 PM (IST)
ఐపీఎల్ 2023లో 200కు పైగా స్కోర్లు 38 సార్లు నమోదయ్యాయి. (Image: CSK Twitter)
IPL 2023 Records: ఒక ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టడం నుంచి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరుగా అవతరించడం వరకు IPL 2023లో అనేక విన్యాసాలు జరిగాయి. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డు నమోదైంది. లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 257 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను సాధించిన రికార్డు ఈ మ్యాచ్ ద్వారా బద్దలైంది.
ఐపీఎల్ 2023లో 19 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసిన రికార్డు బద్దలు అయింది. చివరిగా అంటే IPL 2022 మొత్తం సీజన్‌లో కేవలం 18 సార్లు అన్ని జట్లు కలిసి మొత్తం 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాయి. అయితే ఈ సీజన్‌లో ఈ రికార్డు కేవలం 38 మ్యాచ్‌ల్లోనే బద్దలైంది. ఐపీఎల్ 2023 38వ మ్యాచ్‌లోనే మొత్తం 200 లేదా అంతకంటే ఎక్కువ 19 సార్లు చేశారు.
లక్నో, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ కూడా 200 మార్కును దాటేసింది. దీంతో ఆ జట్టు 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఈ విధంగా ఐపీఎల్ 2023లో మొత్తం 200 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలు 20 సార్లు నమోదయ్యాయి. ఇది ఇతర సీజన్‌ల కంటే ఎక్కువ.
ఒక్క ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు నమోదైన సందర్భాలు
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు 20* సార్లు.
ఐపీఎల్ 2022లో 18 సార్లు.
ఐపీఎల్ 2018లో 15 సార్లు.
ఐపీఎల్ 2020లో 13 సార్లు.
ఐపీఎల్ 2019లో 11 సార్లు.
ఐపీఎల్ 2008లో 11 సార్లు.
విశేషమేమిటంటే లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో మొత్తం 257/5 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు చేసిన రికార్డును కైవసం చేసుకుంది. మరోవైపు ఈ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం 263/5 పరుగులతో అగ్రస్థానంలో ఉంది.
ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇప్పటివరకు మైదానంలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఈ సీజన్‌లో చెన్నై బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా చాలా మంచి ప్రదర్శన కనబరిచింది. దీని కారణంగా ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఐపీఎల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు మిగిలిన సీజన్‌లతో పోలిస్తే 200 స్కోరు కూడా చాలా తేలికగా కనిపిస్తుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నారని దీన్ని బట్టి స్పష్టంగా ఊహించవచ్చు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను 27 సార్లు సాధించగలిగింది. ఇది ఏ జట్టుకు అయినా అత్యధికం.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 24 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు చెరో 19 సార్లు ఈ ఘనత సాధించాయి.
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్