News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IPL 2022: RCB కెప్టెన్‌గా మళ్లీ విరాట్‌ కోహ్లీ? మేజర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన డేనియెల్‌ వెటోరీ

IPL 2022 RCB Captaincy: ఐపీఎల్ కొత్త సీజనుకు మరెన్నో రోజులు లేదు. అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టినా ఆర్సీబీ మాత్రం కాస్త లేటుగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంకా కెప్టెన్ పేరు ప్రకటించడం లేదు.

FOLLOW US: 
Share:

IPL 2022 RCB Captaincy: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Indian premier leauge) ఫీవర్‌ మొదలైంది! షెడ్యూలు ప్రకటించడంతో ఐపీఎల్‌ (IPL) ఫ్యాన్స్‌ అంతా జోష్‌లో ఉన్నారు. ఎప్పుడెప్పుడు మ్యాచులు మొదవుతాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఫ్రాంచైజీలన్నీ తమ జట్లతో వేర్వేరు స్టేడియాల్లో క్యాంపులు మొదలు పెట్టాయి. టీమ్‌ఇండియా, జాతీయ జట్లకు ఆడుతున్న వారు తప్ప మిగతా ఆటగాళ్లంతా క్యాంపులకు చేరుకున్నారు. అందరి ప్రాక్టీస్‌ జోరుగా సాగుతోంది. అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్‌ పేర్లను ప్రకటించాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) మాత్రం ఇంకా ఆ పని చేయలేదు.

కెప్టెన్‌ పేరు ప్రకటించడంలో ఆర్‌సీబీ (RCB) ఆలస్యం చేస్తుండటంతో అభిమానులు అసహనానికి గురవుతున్నారు. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) నే తిరిగి కెప్టెన్‌గా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా (Social Media)లో విరాట్‌ కోహ్లీ పేరును ట్రెండ్‌ చేస్తున్నారు. అయితే ఆర్‌సీబీ మరోసారి కోహ్లీని నాయకుడిగా ప్రకటించబోదని ఆ జట్టు మాజీ ఆటగాడు డేనియెల్‌ వెటోరీ (Daniel Vettori) అంటున్నాడు. ఇతర ఆప్షన్లను ప్రయత్నిస్తుందని అంచనా వేస్తున్నాడు.

'లేదు, ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి మళ్లీ అవకాశం ఉండదు. ఇది చాలా సింపుల్‌ విషయం. మళ్లీ అతడిని కెప్టెన్‌గా ప్రకటించడం పని చేస్తుందని అనుకోవడం లేదు. ఒకసారి కెప్టెన్సీ నుంచి దిగిపోయారంటే మళ్లీ కుదరదు' అని వెటోరీ అన్నాడు. ఆర్‌సీబీకి మరికొన్ని కెప్టెన్సీ ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్‌ను బెంగళూరు రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. దినేశ్‌ కార్తీక్‌ను రూ.5.50 కోట్లకు సొంతం చేసుకుంది. వీరిద్దరికీ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా గత సీజన్లో ఆర్‌సీబీ తరఫున అదరగొట్టిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను ప్రయత్నించొచ్చు. బిగ్‌బాష్‌లో అతడు మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు.

'బహుశా విరాట్‌ కోహ్లీ, మాక్స్‌వెల్‌ (Maxwell), డుప్లెసిస్‌కు ఆర్‌సీబీ తన లీడర్‌షిప్‌ గ్రూపులో చోటిస్తుంది. దినేశ్‌ కార్తీక్‌నూ తీసుకోవచ్చు. నాకు తెలిసి మాక్స్‌వెల్ కన్నా ముందు డుప్లెసిస్‌కు కెప్టెన్సీ ఇవ్వొచ్చు. తొలి మూడు మ్యాచులు గెలిస్తే అతడినే కొనసాగించొచ్చు. మాక్స్‌వెల్‌ను లాంగ్‌టర్మ్‌ కోణంలో చూడొచ్చు. మూడేళ్ల పాటు అతడికి అవకాశం ఇవ్వొచ్చు. ఇందుకతడు గత సీజన్లో లాగా బాగా ఆడాలి' అని వెటోరీ అన్నాడు. అయితే మార్చి 12న కొత్త కెప్టన్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Published at : 08 Mar 2022 12:00 PM (IST) Tags: IPL RCB Virat Kohli Virat Kohli news IPL 2022 IPL news royal challengers bangalore Daniel Vettori IPL 15 Virat Kohli RCB IPL 2022 Update IPL 2022 news

ఇవి కూడా చూడండి

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్