News
News
వీడియోలు ఆటలు
X

DC vs RR, Match Highlights: రాజస్తాన్ గెలిచింది - కానీ క్రికెట్ ఓడింది - చివరి ఓవర్లో?

IPL 2022, DC vs RR: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

FOLLOW US: 
Share:

ఐపీఎల్‌లో శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 202 పరుగులే సాధించింది. దీంతో రాజస్తాన్‌ను విజయం వరించింది. అయితే ఆట చివరి ఓవర్లో జరిగిన ఒక సంఘటన వివాదాస్పదంగా మారింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (116: 65 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (54: 35 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు ఏకంగా 155 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచి ఢిల్లీ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. జోస్ బట్లర్ మొదట కొంచెం నిదానంగా ఆడినా... తర్వాత పుంజుకున్నాడు. అర్థ సెంచరీ సాధించిన అనంతరం దేవ్‌దత్ పడిక్కల్, సెంచరీ చేశాక జోస్ బట్లర్ అవుటైనా... సంజు శామ్సన్ (46 నాటౌట్: 19 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్ వేగం అస్సలు తగ్గకుండా చూశాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లలో ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడకపోయినా... పరుగుల వేగం మాత్రం ఎక్కడా తగ్గనివ్వలేదు. పృథ్వీ షా (37: 25 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), డేవిడ్ వార్నర్ (28: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), రిషబ్ పంత్ (44: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), లలిత్ యాదవ్ (37: 24 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)... ముఖ్యంగా చివర్లో రొవ్‌మన్ పావెల్ (36: 15 బంతుల్లో, ఐదు సిక్సర్లు) వేగంగా ఆడారు. అయితే ఆట చివర్లో నెలకొన్న హైడ్రామా మ్యాచ్‌ను వివాదాస్పదంగా మార్చింది. గెలవాలంటే మూడు ఓవర్లకు 51 పరుగులు చేయాల్సిన దశలో లలిత్ యాదవ్, రొవ్‌మన్ పావెల్ అద్భుతంగా పోరాడారు. ట్రెంట్ బౌల్డ్ వేసిన 18వ ఓవర్లో పావెల్ రెండు సిక్సర్లు కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి.

దీంతో ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 36 పరుగులు కావాల్సి వచ్చింది. 19వ ఓవర్‌ను ప్రసీద్ కృష్ణ అద్భుతంగా వేశాడు. టచ్‌లో ఉన్న లలిత్ యాదవ్‌ను అవుట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ వేశాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఒక్క ఓవర్లో 36 పరుగులు అవసరం అయ్యాయి. మ్యాచ్ రాజస్తాన్‌దే అనుకున్నారంతా...

ఆఖరి ఓవర్లో హైడ్రామా...
అయితే ఢిల్లీ శిబిరంలో పావెల్ ఆశలు రేపాడు. ఒబెడ్ మెకాయ్ వేసిన మొదటి మూడు బంతులను సిక్సర్లు కొట్టాడు. అయితే ఫుల్ టాస్‌గా వచ్చిన మూడో బంతి నడుము పైకి వచ్చిందని నోబాల్ చెక్ చేయాలని రొవ్‌మన్ పావెల్ కోరాడు. దీనికి అంపైర్లు నిరాకరించారు. డగౌట్‌లో ఉన్న ఢిల్లీ ఆటగాళ్లు కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకదశలో రిషబ్ పంత్ బ్యాటర్లను వెనక్కి వచ్చేయమన్నాడు కూడా. అయినా అంపైర్లు నిర్ణయాన్ని సమీక్షించలేదు. మిగతా జట్టు సభ్యులు పంత్‌కు సర్దిచెప్పడంతో ఆట కొనసాగింది.

ఈ గొడవలో పావెల్ కూడా ఊపు కోల్పోయాడు. నాలుగో బంతి డాట్ బాల్ కాగా... ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. చివరి బంతికి అవుటయ్యాడు. అయితే రీప్లేలో మాత్రం మూడో బంతి నడుముకి కొంచెం పైనుంచే వెళ్తున్నట్లు కనిపించింది. మ్యాచ్ ముగిశాక రెండు జట్ల ఆటగాళ్లు కనీసం షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. అయితే ఇది చివరి ఓవర్ వివాదం వల్లనా... కోవిడ్ నిబంధనల కారణంగానా అని తెలియరాలేదు.

Published at : 22 Apr 2022 11:48 PM (IST) Tags: IPL Delhi Capitals DC Rishabh Pant IPL 2022 RR Rajasthan Royals Sanju Samson DC vs RR Wankhede Stadium IPL 2022 Match 34

సంబంధిత కథనాలు

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Academic Calendar: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!