అన్వేషించండి

IPL 2022, RR vs RCB: భయపెడుతున్న రాజస్థాన్‌! మెరుగైన బెంగళూరు! 'రాయల్స్‌' పోరులో గెలుపెవరిది?

IPL 2022 RR vs RCB preview: వరుసగా రెండు మ్యాచులు గెలిచిన రాజస్థాన్‌ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. చివరి మ్యాచ్‌ గెలిచిన బెంగళూరు ఐదు రోజుల తర్వాత మ్యాచ్‌ ఆడుతోంది. మరి వీరిద్దరిలో (RR vs RCB) ఎవరిది పై చేయి?

Royals vs Royal Challengers bangalore playing xi head to head records in ipl :  ఐపీఎల్‌ 2022 సీజన్‌ 13వ మ్యాచులో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. వాంఖడే (Wankhede Stadium) ఇందుకు వేదిక. వరుసగా రెండు మ్యాచులు గెలిచిన రాజస్థాన్‌ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. చివరి మ్యాచ్‌ గెలిచిన బెంగళూరు ఐదు రోజుల తర్వాత మ్యాచ్‌ ఆడుతోంది. మరి వీరిద్దరిలో (RR vs RCB) ఎవరిది పై చేయి? వాంఖడేలో గెలిచేదెవరు? తుది జట్టులో ఎవరెవరు ఉంటారు?

Rajasthan Royals ఫైర్‌!

గతేడాది పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ సారి దుమ్మురేపుతోంది. వేలంలో సరైన ఆటగాళ్లను తీసుకోవడంతో జట్టు పరిస్థితి మారిపోయింది. భీకరమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌తో ట్రోఫీ రేసులో ఉందనిపిస్తోంది. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ రెండుసార్లు తమ స్కోర్లను డిఫెండ్‌ చేసుకుంది సంజు శామ్సన్‌ (Sanju Samson) సేన. మరోవైపు డుప్లెసిస్‌ (Faf Du Plessis) నాయకత్వంలో జోష్‌లో కనిపిస్తున్న బెంగళూరు బ్యాటింగ్‌ లైనప్‌లో కాస్త ఒత్తిడి ఎదుర్కొంటోంది. మాక్స్‌వెల్‌ (Glenn Maxwell) వస్తే మరింత మెరుగ్గా మారుతుంది. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) స్వేచ్ఛగా ఆడుతుండటం ఊరట కలిగించే అంశం.

RR vs RCB, అప్పర్‌ హ్యాండ్‌ ఎవరిదంటే?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL 2022) రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డాయి. ఈ రెండు జట్లు సమవుజ్జీలుగానే ఉన్నాయి. అయితే రాజస్థాన్‌దే కాస్త అప్పర్ హ్యాండ్‌! ఆ జట్టు 12 గెలిస్తే బెంగళూరు 10 గెలిచింది. అయితే చివరగా తలపడ్డ ఐదు మ్యాచుల్లో బెంగళూరు 4-0 ఆధిపత్యం చెలాయించింది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు.

* రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌ ఒక్కదగ్గరకు చేరడంతో రాజస్థాన్‌ స్పిన్‌ బౌలింగ్‌ భయంకరంగా మారింది. ట్రెంట్‌బౌల్ట్‌, ప్రసిద్ధ్ కృష్ణ పేస్‌ భీకరంగా ఉంది.
* బెంగళూరు ఎక్కువగా స్పిన్నర్‌ వనిందు హసరంగ, పేసర్‌ హర్షల్‌ పటేల్‌ మీద ఆధారపడింది. వీరిద్దరూ బాగా ఆడుతున్నారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 9 నుంచి వస్తాడు.
* ప్రసిద్ధ్‌, బౌల్ట్‌ బౌలింగ్‌లో కోహ్లీ మంచి రికార్డు ఉంది. వీరిద్దరిపై 140 స్ట్రైక్‌రేట్‌ ఉంది.
* హసరంగ బౌలింగ్‌లో సంజుకు మెరుగైన రికార్డు లేదు. 4 టీ20ల్లో 11 బంతులాడి 3 సార్లు ఔటయ్యాడు. బట్లర్‌ సైతం ఇలాగే ఉన్నాడు.
* ఐపీఎల్‌ 2021 నుంచి యుజ్వేంద్ర చాహల్‌ 17 మ్యాచులో 23 వికెట్లు తీశాడు. ఇలాంటి రికార్డు మరే స్పిన్నర్‌కు లేదు.

RR vs RCB probable xi
 
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, అనుజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ, దినేశ్ కార్తీక్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, డేవిడ్‌ విలే, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్

రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌, దేవదత్‌ పడిక్కల్‌, సంజు శాంసన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, నవదీప్‌ సైనీ, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
Pawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
Lionel Messi: మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
Embed widget