By: ABP Desam | Updated at : 04 May 2022 05:55 PM (IST)
Edited By: Ramakrishna Paladi
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (Starsports telugu twitter)
IPL 2022 royal challengers bangalore vs chennai superkings head to head records : ఐపీఎల్ 2022లో 49వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings) తలపడుతున్నాయి. పుణెలోని ఎంసీఏ మైదానం (MCA Stadium) ఇందుకు వేదిక. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేకు పోయేదేమీ లేదు. కాబట్టి స్వేచ్ఛగా ఆడతారు. ఆర్సీబీకి మాత్రం ఈ మ్యాచ్ ప్రాణ సంకటం. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?
CSKదే పైచేయి
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆఖరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆడిన 9లో 3 విజయాలు అందుకుంది. ఇకపై అన్ని మ్యాచులూ గెలిస్తూ పోతే టెక్నికల్‌గా ప్లేఆఫ్స్‌కు అవకాశం ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సిచ్యువేషన్ మాత్రం భిన్నం. 10 మ్యాచుల్లో 5 గెలిచి 5 ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిస్తే నాలుగో స్థానంలోకి వెళ్లిపోతుంది. కాగా ఆర్సీబీపై చెన్నైదే పైచేయి. ఇప్పటి వరకు వీరు 29 మ్యాచుల్లో తలపడితే సీఎస్‌కే 19 సార్లు గెలిచింది. ఈ సీజన్లో చివరి మ్యాచులోనూ వారిదే విజయం.
RCB అటో ఇటో!
ప్రతి సీజన్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆరంభంలో అదరగొట్టి మధ్యలో చతికిల పడుతుంది. ఆఖర్లో టెన్షన్ పడుతుంది. ఈ సీజన్లో చివరగా ఆడిన మూడు మ్యాచుల్లో ఓటమి పాలైంది. బ్యాటింగ్ యూనిట్లో నిలకడ లోపించింది. డుప్లెసిస్ అంచనాలను అందుకోవడం లేదు. మాక్సీ సైతం తన స్థాయికి తగిన ఇన్నింగ్సులు ఆడటం లేదు. షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ మాత్రమే నిలకడ చూపిస్తున్నారు. కోహ్లీ ఫామ్‌లోకి రావడం కాస్త ఆనందం. బౌలింగ్ విభాగం మాత్రం బాగానే ఉంది. హర్షల్ పటేల్, హేజిల్‌వుడ్, హసరంగ, షాబాజ్, సిరాజ్ ఫర్వాలేదు.
CSKలో కొత్త జోష్
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగ్ టీమ్ సన్‌రైజర్స్‌పై విజయంతో ఈ మ్యాచుకు వస్తోంది. వారిని తక్కువ అంచనా వేస్తే ఆర్సీబీకి ప్రమాదమే. ఇప్పుడిప్పుడే జట్టుకు సమతూకం వస్తున్నట్టు అనిపిస్తోంది. మొన్న రుతురాజ్, డేవాన్ కాన్వే ఓపెనింగ్ అదిరింది. అంబటి రాయుడు, ఉతప్ప, ధోనీ ఫర్వాలేదు. ఇప్పుడు డ్వేన్ బ్రావో, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీలో ఎవరో ఒక్కరికే ఛాన్స్ ఉంది. కెప్టెన్సీ వదిలేశాక జడ్డూ ఉత్సాహంగా బౌలింగ్ చేశాడు. ఆర్సీబీకి ముఖ్యమైన మ్యాచ్ కావడంతో ఆర్సీబీ ధాటిగా ఆడినా చెప్పలేం.
RCB vs CSK Probable XI
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ / మిచెల్ శాంట్నర్ / డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, మహేశ్ థీక్షణ, సిమ్రన్‌జీత్ సింగ్, ముకేశ్ చౌదరి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోస్ హేజిల్‌వుడ్
In sync and 💪Here is the peek into the game tonight with Mr. Cricket @mhussey393!#RCBvCSK #Yellove #WhistlePodu 🦁💛 @amazonIN #AmazonPay pic.twitter.com/zeERmr6CNT
— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2022
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!
IPL 2022 Final: ఐపీఎల్ ఫైనల్.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!
RR vs RCB, Qualifier 2: ఈ లెగ్ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్