RCB vs CSK: అమ్మో ధోనీ! RCBని చూస్తే పూనకమే! 46 సిక్సర్లు కొట్టేశాడు.. 50కి రెడీ!
IPL 2022 rcb vs csk match ups: ఐపీఎల్ 2022లో 49వ మ్యాచులో బెంగళూరు , చెన్నై తలపడుతున్నాయి. ఈ మ్యాచుకు సంబంధించి కొన్ని మ్యాచప్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
IPL 2022 rcb vs csk ms dhoni 46 sixes against rcb virat kohli near 1000 runs : ఐపీఎల్ 2022లో 49వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings) తలపడుతున్నాయి. ఈ మ్యాచుకు సంబంధించి కొన్ని మ్యాచప్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఎంఎస్ ధోనీ (MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)కి కొన్ని రికార్డులు ఉన్నాయి.
* కొన్నేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఎంఎస్ ధోనీ భీకరంగా పరుగులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏకంగా 46 సిక్సర్లు బాదేశాడు. వారిపై ఇన్ని సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడు అతడే.
* ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచుల్లో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ 8 సార్లు పేసర్ల బౌలింగ్‌లో ఔటయ్యాడు.
* చెన్నై సూపర్ కింగ్స్ అంటే విరాట్ కోహ్లీకి మస్తు ఇష్టం! వారిపై ఇప్పటి వరకు 949 పరుగులు చేశాడు. ఒక అపోజిషన్‌పై అతడికి అత్యధిక పరుగులు ఇవే. మరో 51 చేస్తే 1000 పూర్తి చేసుకుంటాడు.
* ఎంఎస్ ధోనీపై హర్షల్ పటేల్‌కు మంచి రికార్డుంది. అతడిని 2 సార్లు ఔట్ చేశాడు. అంబటి రాయుడి పైనా సక్సెస్ రేటు బాగుంది. ఐదుసార్లు పెవిలియన్ పంపించాడు. రాయుడు బాటమ్ హ్యాండ్, రిస్ట్ పవర్‌తో పరుగులు చేస్తున్నప్పటికీ వేగంలో మార్పులు చేస్తే అతడిని బురిడీ కొట్టిస్తున్నాడు.
* ఈ సీజన్లో మిడిల్ ఓవర్లలో ఆర్సీబీదే బెస్ట్ బౌలింగ్. 18.53 సగటుతో 34 వికెట్లు తీశారు. అంటే చెన్నై మిడిలార్డర్‌కు ఇది ప్రమాదకరమే.
* ఆర్సీబీ బ్యాటింగ్‌ను అడ్డుకొనేందుకు సీఎస్‌కే సహజంగా స్పిన్నర్లను ప్రయోగిస్తుంది. 2018 నుంచి 16 సగటుతో 31 వికెట్లు అలాగే పడగొట్టారు. మాక్సీ (7 సార్లు ఔట్), డీకే (3), విరాట్ (3) ఇబ్బంది పెట్టేందుకు రవీంద్ర జడేజాను ధోనీ ఉపయోగిస్తాడు.
CSKదే పైచేయి
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆఖరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆడిన 9లో 3 విజయాలు అందుకుంది. ఇకపై అన్ని మ్యాచులూ గెలిస్తూ పోతే టెక్నికల్‌గా ప్లేఆఫ్స్‌కు అవకాశం ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సిచ్యువేషన్ మాత్రం భిన్నం. 10 మ్యాచుల్లో 5 గెలిచి 5 ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిస్తే నాలుగో స్థానంలోకి వెళ్లిపోతుంది. కాగా ఆర్సీబీపై చెన్నైదే పైచేయి. ఇప్పటి వరకు వీరు 29 మ్యాచుల్లో తలపడితే సీఎస్‌కే 19 సార్లు గెలిచింది. ఈ సీజన్లో చివరి మ్యాచులోనూ వారిదే విజయం.
RCB vs CSK Probable XI
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ / మిచెల్ శాంట్నర్ / డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, మహేశ్ థీక్షణ, సిమ్రన్‌జీత్ సింగ్, ముకేశ్ చౌదరి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోస్ హేజిల్‌వుడ్
In sync and 💪Here is the peek into the game tonight with Mr. Cricket @mhussey393!#RCBvCSK #Yellove #WhistlePodu 🦁💛 @amazonIN #AmazonPay pic.twitter.com/zeERmr6CNT
— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2022