RCB vs CSK, 1 innings Highlights: ధోనీ వ్యూహం ఛేదించిన డీకే: చెన్నై టార్గెట్ ఎంతంటే?
RCB vs CSK, 1 innings Highlights: ఐపీఎల్ 2022లో 49వ మ్యాచులో బెంగళూరు మంచి స్కోరే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. మహిపాల్ లోమ్రర్ (42) అమేజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
RCB vs CSK, 1 innings Highlights: ఐపీఎల్ 2022లో 49వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ప్రత్యర్థి బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు చిత్తు చేశారు. మహిపాల్ లోమ్రర్ (42; 27 బంతుల్లో 3x4, 2x6) అమేజింగ్ ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టాడు. డుప్లెసిస్ (38; 22 బంతుల్లో 4x4, 1x6), దినేశ్ కార్తీక్ (26*; 27 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. థీక్షణ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి శుభారంభమే దక్కింది. డుప్లెసిస్, విరాట్ కోహ్లీ (30; 33 బంతుల్లో 3x4, 1x6) తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి పవర్‌ప్లేలో 57 పరుగులు సాధించారు. వరుసగా బౌండరీలు దంచికొడుతున్న డుప్లెసిస్‌ను 7.2వ బంతికి మొయిన్ అలీ ఔట్ చేశాడు. కోహ్లీతో సమన్వయ లోపంతో 76 వద్ద మాక్స్‌వెల్ (3) రనౌట్ అయ్యాడు. మరో 3 పరుగుల వ్యవధిలో విరాట్‌ను అలీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ సిచ్యువేషన్‌లో మహిపాల్ లోమ్రర్, రజత్ పాటిదార్ (21; 15 బంతుల్లో 1x4, 1x6) జట్టును ఆదుకున్నారు. వేగంగా రన్స్ కొట్టి రన్‌రేట్ పెంచారు. 123 వద్ద భారీ షాట్ ఆడబోయిన పాటిదార్‌ను ముకేశ్ ఔట్ చేశాడు. దినేశ్ కార్తీక్ అండతో లోమ్రర్ భారీ షాట్లు ఆడినా 155 వద్ద అతడిని థీక్షణ పెవిలియన్ పంపించాడు. తర్వాతి బంతికే హసరంగ (0)నూ గోల్డెన్ డక్‌గా తిప్పిపంపాడు. షాబాజ్ (1)నూ ఔట్ చేశాడు. కానీ ఆఖరి ఓవర్లో డీకే 16 రన్స్ సాధించి స్కోరును 173/8కి చేర్చాడు.
Threekshana back at it! 😍#RCBvCSK #WhistlePodu #Yellove💛🦁 pic.twitter.com/RawG9F3GeS
— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2022
Well played, LOM-ROAR! 👏🏻@mahipallomror36 #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvCSK pic.twitter.com/YfqKxFHXVQ
— Royal Challengers Bangalore (@RCBTweets) May 4, 2022
Rotating the strike, with some big hits in between. Lomror and Patidar have steadied the ship for a BIG finish. 🙌🏻
— Royal Challengers Bangalore (@RCBTweets) May 4, 2022
Keep going boys! 👊🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvCSK pic.twitter.com/4BYD612Q2Q