By: ABP Desam | Updated at : 30 Apr 2022 07:47 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రవీంద్ర జడేజా చెన్నై పగ్గాలను తిరిగి ధోనికి అప్పగించాడు. (Image Credits: BCCI)
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మళ్లీ చేతులు మారింది. రవీంద్ర జడేజా కెప్టెన్సీని తిరిగి మహేంద్ర సింగ్ ధోనికి అందించాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తన వ్యక్తిగత ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడని, మహేంద్ర సింగ్ ధోని కూడా జడేజా నిర్ణయానికి అంగీకరించి తిరిగి పగ్గాలు అందుకుంటున్నాడని చెన్నై తన ప్రకటనలో పేర్కొంది.
రవీంద్ర జడేజా నాయకత్వంలో చెన్నై ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా... కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. దీంతో పాటు వ్యక్తిగతంగా కూడా జడేజా పెద్దగా మెరుపులు మెరిపించలేదు. బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ పెద్దగా రాణించలేకపోయాడు. ఆటగాడిగా విఫలం అవుతుండటంతో జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ సీజన్‌లో చెన్నై ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కెప్టెన్ జడేజా అయినా ధోని ఇన్‌పుట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించడంతో చెన్నై అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి.
📢 Official announcement!
Read More: 👇#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja — Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
RCB Vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ - ప్లేఆఫ్స్‌కు చేరాలంటే బెంగళూరు కష్టపడాల్సిందే!
RCB Vs GT Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ - బెంగళూరుకు భారీ గెలుపు అవసరం!
IPL 2022: ఐపీఎల్ 2022 మెగా ఫైనల్ టైమింగ్‌లో మార్పు! ఈ సారి బాలీవుడ్ తారలతో..
GT vs RCB: అడకత్తెరలో ఆర్సీబీ! GTపై గెలిచినా దిల్లీ ఓడాలని ప్రార్థించక తప్పదు!
Elon Musk: ఎలన్ మస్క్ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం
Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్