By: ABP Desam | Updated at : 02 May 2022 09:47 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అర్థ సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న సంజు శామ్సన్ (Image Credits: IPL)
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శామ్సన్ (54: 49 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 153 పరుగులు కావాలి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు వారు ఆశించిన ఆరంభం లభించలేదు. దేవ్‌దత్ పడిక్కల్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఆ తర్వాత ఫాంలో ఉన్న జోస్ బట్లర్ (22: 25 బంతుల్లో, మూడు ఫోర్లు), కెప్టెన్ సంజు శామ్సన్ ఇన్నింగ్స్‌ను మెల్లగా ముందుకు తీసుకెళ్లారు. వీళ్లిద్దరూ వేగంగా ఆడలేకపోవడం స్కోరు నిదానంగా కదిలింది. రెండో వికెట్‌కు వీరిద్దరూ 48 పరుగులు జోడించాక జోస్ బట్లర్ అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (13: 13 బంతుల్లో, ఒక ఫోర్), రియాన్ పరాగ్ (19: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. చివర్లో షిమ్రన్ హెట్‌మేయర్ (27 నాటౌట్: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) వేగంగా ఆడినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. దీంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు తీయగా... శివం మావి, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.
RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!
IPL 2022 Final: ఐపీఎల్ ఫైనల్.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!
RR vs RCB, Qualifier 2: ఈ లెగ్ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!
RR vs RCB Qualifier 2: మోతేరా అప్పట్లో రాయల్స్ అడ్డా! ఆర్సీబీ ఫుల్ జోష్‌లో ఉంది బిడ్డా!
Sabbhineni Meghana: మహిళల ఐపీఎల్‌లో దంచికొట్టిన మేఘన! ఈ ఆంధ్రా అమ్మాయి స్పెషలిటీ తెలుసా?
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన