PBKS vs RR, Toss update: పంజాబ్‌దే ఫస్ట్ బ్యాటింగ్! కీలక మార్పు చేసిన సంజు శాంసన్
PBKS vs RR, Toss update: ఐపీఎల్ 2022లో 52వ మ్యాచ్ టాస్ వేశారు. పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
PBKS vs RR, Toss update: ఐపీఎల్ 2022లో 52వ మ్యాచ్ టాస్ వేశారు. పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ చాలా బాగుందన్నాడు. జట్టులో మార్పులేమీ చేయడం లేదని పేర్కొన్నాడు. టాస్ గెలిస్తే తామూ బ్యాటింగే తీసుకుందామని అనుకున్నామని రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అన్నాడు. తమ జట్టు సమతూకం బాగుందన్నాడు. కరుణ్ నాయర్ స్థానంలో యశస్వీ జైశ్వాల్‌ను తీసుకుంటున్నామని వెల్లడించాడు.
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, రాహుల్ చాహర్, కాగిసో రబాడా, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ సేన్
రాజస్థాన్‌దే పైచేయి
ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి దశకు చేరుకుంటోంది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే రాజస్థాన్, పంజాబ్‌కు ప్రతి మ్యాచ్ ఇంపార్టెంటే! అందుకే ఈ మ్యాచ్ గెలిస్తే మున్ముందు ప్రెజర్ నుంచి తప్పించుకోవచ్చు. బలంగా కనిపిస్తున్న సంజూ సేన 10 మ్యాచులాడి 6 గెలిచి 12 పాయింట్లో మూడో స్థానంలో ఉంది. రనరేటూ పాజిటివ్‌గానే ఉంది. ఇకపై జరిగే నాలుగు మ్యాచుల్లో కనీసం మూడు గెలిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయి. పంజాబ్ 10 మ్యాచుల్లో 5 గెలిచి 7వ స్థానంలో ఉంది. నెగెటివ్ రన్‌రేట్‌తో ఉంది. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ చావో రేవో అన్నట్టుగానే ఆడాలి. ఈ రెండు జట్టు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా 14-9తో రాజస్థాన్‌దే పైచేయి.
🚨 Toss Update 🚨@PunjabKingsIPL have elected to bat against @rajasthanroyals.
— IndianPremierLeague (@IPL) May 7, 2022
Follow the match ▶️ https://t.co/Oj5tAfX0LP #TATAIPL | #PBKSvRR pic.twitter.com/7aagJzGe5A
🚨 Team News 🚨@PunjabKingsIPL remain unchanged.
— IndianPremierLeague (@IPL) May 7, 2022
1⃣ change for @rajasthanroyals as Yashasvi Jaiswal is named in the team.
Follow the match ▶️ https://t.co/Oj5tAfX0LP #TATAIPL | #PBKSvRR
A look at the Playing XIs 👇 pic.twitter.com/nVh7V6mG8B