KKR Vs LSG Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో - రెండో స్థానం కావాలంటే గెలవాల్సిందే!
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్‌లో బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ రెండు జట్లకూ లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ నంబర్ వన్ స్థానంలో ఉండటం కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు లక్నో రెండో స్థానానికి చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి. అలాగే కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాంటే వారికి కూడా విజయం అవసరమే. కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.
ఈ రెండు జట్లూ ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల భారీ తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 14.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్‌కతా రన్‌రేట్ తక్కువగా ఉండటానికి కూడా ఆ ఓటమే కారణం.
ఇక తుదిజట్ల విషయానికి వస్తే... కోల్‌కతా ఒక్క మార్పు మాత్రమే చేసింది. అజింక్య రహానే స్థానంలో అభిజిత్ తోమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక లక్నో కూడా మూడు మార్పులు చేసింది. దుష్మంత చమీర స్థానంలో ఎవిన్ లెవిస్, అయుష్ బదోని స్థానంలో మనన్ వోహ్రా, కృనాల్ పాండ్యా స్థానంలో కృష్ణప్ప గౌతం తుదిజట్టులోకి వచ్చారు.
లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మొహ్‌సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, అవేష్ ఖాన్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
వెంకటేష్ అయ్యర్, అభిజిత్ తోమార్, నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
View this post on Instagram