KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 210 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఓపెనర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 210 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (140 నాటౌట్: 70 బంతుల్లో, 10 ఫోర్లు, 10 సిక్సర్లు) చెలరేగి ఆడగా... కేఎల్ రాహుల్ (68 నాటౌట్: 51 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మరోవైపు తనకు చక్కటి సహకారం అందించాడు. కోల్‌కతా గెలవాలంటే 120 బంతుల్లో 211 పరుగులు అవసరం. ఐపీఎల్‌లో మొదటి వికెట్‌కు ఇదే రికార్డు భాగస్వామ్యం కావడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లను ఆపడం కోల్‌కతా బౌలర్ల వల్ల కాలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు వచ్చాయి. కానీ ఇలాంటి పార్ట్‌నర్‌షిప్ మాత్రం ఎప్పుడూ చూడలేదు. డికాక్ 70 బంతుల్లోనే 140 పరుగుల కొట్టాడు. ఏకంగా 10 సిక్సర్లు, 10 బౌండరీలు బాదేయడం విశేషం. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. 59 బంతుల్లో 100 పరుగుల మైలురాయి అధిగమించాడు. 19వ ఓవర్లో 3 సిక్సర్లు, 20వ ఓవర్లో 4 బౌండరీలు కొట్టిన తీరు అయితే హైలెట్. అతడికి తోడుగా కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 బౌండరీలు, 4 సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు.
ఓపెనింగ్ భాగస్వామ్యంతో పాటు క్వింటన్ డికాక్ మరో రికార్డును సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. క్రిస్ గేల్ (175 నాటౌట్), బ్రెండన్ మెక్‌కలమ్ (158 నాటౌట్) మాత్రమే డికాక్ కన్నా ముందున్నారు. ఏబీ డివిలియర్స్ (133 నాటౌట్), కేఎల్ రాహుల్ (132 నాటౌట్) టాప్-5లో ఉన్నారు. లీగ్ చరిత్రలో ఏ వికెట్‌పై అయినా అత్యధిక మూడో భాగస్వామ్యం రికార్డునూ క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ జోడీ నెలకొల్పింది. 2016లో గుజరాత్ లయన్స్‌పై 229, 2015లో ముంబయిపై 215 పరుగులతో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ నెలకొల్పిన భాగస్వామ్యాల తర్వాత ఇదే అత్యధికం.
View this post on Instagram