IPL 2022, LSG vs RCB: ఆ 'గూగ్లీ' కుర్రాడంటే దినేశ్ కార్తీక్‌కూ భయమే అన్నమాట! కేఎల్‌కు మాక్సీతో గండం!
LSG vs RCB Preview: ఐపీఎల్ 2022లో 31వ మ్యాచులో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. మరి ఈ రెండు జట్లలో ఎవరిది పైచేయి?
IPL 2022, lsg vs rcb preview lucknow supergiants vs royal challengers bangalore head to head records: ఐపీఎల్ 2022లో 31వ మ్యాచులో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. డీవై పాటిల్ మైదానం (DY Patil Stadium) ఇందుకు వేదిక. రాహుల్ సేన కంప్లీట్ డెప్త్‌తో జోష్‌లో ఉంది. మరోవైపు దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ టచ్‌తో బెంగళూరు గట్టిపోటీనిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? ఎవరితో ఎవరికి ముప్పు?
ఈ సీజన్లో లక్నో (LSG), బెంగళూరు (RCB) చెరో 6 మ్యాచులు ఆడాయి. 4 గెలిచి 8 పాయింట్లతో ఉన్నాయి. నెట్ రన్‌రేట్ మాత్రమే ఇద్దరికీ తేడా! లక్నోతో పోలిస్తే బెంగళూరు బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. డుప్లెసిస్ (Faf Du Plessis), అనుజ్ రావత్ ఓపెనింగ్ భాగస్వామ్యాలు బాగాలేవు. వన్‌డౌన్‌లో వస్తున్న విరాట్ కోహ్లీ (Virat kohli) హఠాత్తుగా ఔటైపోతున్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell), దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇస్తూ విజయాలు అందిస్తున్నారు. షాబాజ్ అహ్మద్ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ యూనిట్ సూపర్ ఫామ్‌లో ఉంది. కేఎల్ రాహుల్ (KL Rahul), క్వింటన్ డికాక్ (Quinton Decock) ఓపెనింగ్‌కు తిరుగులేదు. వన్‌డౌన్లో వస్తున్న మనీశ్ పాండే (Manish Panday) ముంబయి మ్యాచుతో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఎవిన్ లూయిస్, కృష్ణప్ప గౌతమ్ సైతం ఫర్వాలేదు. మార్కస్ స్టాయినిస్ (Marcuk Stoinis) రావడంతో బౌలింగ్ మరింత బలపడింది. ఈ రెండు జట్ల పోటీలో కొన్ని మ్యాచ్‌అప్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
* దినేశ్ కార్తీక్‌ను ఆపడం ఎవరికీ సాధ్యమవ్వడం లేదు. పేస్‌లో బీభత్సమైన హిట్టింగ్ చేస్తున్న అతడు రిస్ట్‌స్పిన్‌లో మాత్రం కాస్త తడబడుతున్నాడు. రవి బిష్ణోయ్ (Ravi Bishnoi)తో అతడికి కచ్చితంగా ప్రమాదం ఉంది. 2020 నుంచి రైటార్మ్ రిస్ట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో 47 బంతులాడిని డీకే 42 పరుగులే చేశాడు. బిష్ణోయ్ వేసిన 20 బంతుల్లో 25 పరుగులే చేశాడు.
* ముంబయి తర్వాత కేఎల్ రాహుల్ ఎక్కువగా ఎంజాయ్ చేసేది బెంగళూరుపైనే! అయితే మాక్స్‌వెల్‌తో అతడికి ప్రమాదం పొంచివుంది. 4 ఇన్నింగ్సుల్లో 18 బంతులు ఆడిన కేఎల్ కేవలం 20 పరుగులు చేసి రెండుసార్లు ఔటయ్యాడు.
* ఐపీఎల్ 2022 పవర్‌ప్లేలో ఈ రెండు జట్లు ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాయి. లక్నో 8.61, బెంగళూరు 7.86 ఎకనామీతో పరుగులు ఇస్తున్నాయి.
* లక్నో బౌలింగ్‌లో అవేశ్ ఖాన్ (Avesh Khan) మళ్లీ కీలకం కానున్నాడు. 2022 ఐపీఎల్‌లో పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో చెరో 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్‌కు మాత్రమే ఈ రికార్డు సొంతమైంది.
LSG vs RCB Probable Playing XI
లక్నో సూపర్ జెయింట్స్ (LSG Playing xi): కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మనీశ్ పాండే, అయుష్ బదోనీ, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, దుష్మంత చమీరా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Playing xi): డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మాక్స్‌వెల్, ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
😎 @CricketerKalyan డైలాగ్ విన్నారుగా 🤩
— StarSportsTelugu (@StarSportsTel) April 19, 2022
స్ట్రైక్రేటా.. లేక స్పీడో మీటరా అంట 😂
ఆ రేంజ్‌లో దుమ్మురేపుతున్నాడు @DineshKarthik 💥
ఈరోజు మ్యాచ్‌లోనూ అదరగొడతాడా? 🔥
చూడండి#LSGvRCB | సా 6:30 కు#TATAIPL #Epic #IdiIppuduNormale
మీ #StarSportsTelugu / Disney + Hotstar లో pic.twitter.com/33biZ26GQc