LSG Vs KKR Highlights: కోల్‌కతాపై చెలరేగిన డికాక్, హుడా - నైట్‌రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతా గెలవాలంటే 120 బంతుల్లో 177 పరుగులు కావాలి. నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఈ విజయం తప్పనిసరి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒక్క బంతి కూడా ఆడకుండానే ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ (0: 0 బంతుల్లో) డకౌటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన క్వింటన్ డికాక్ (50: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), దీపక్ హుడా (41: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడారు. రెండో వికెట్‌కు కేవలం 39 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు.
వీరిద్దరూ అవుటయ్యాక ఇన్నింగ్స్ నెమ్మదించింది. కృనాల్ పాండ్యా (25: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), అయుష్ బదోని (15: 18 బంతుల్లో) నెమ్మదిగా ఆడారు. కానీ శివం మావి వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఐదు సిక్సర్లతో 30 పరుగులు వచ్చాయి. మొదటి మూడు బంతులను సిక్సర్లు కొట్టిన మార్కస్ స్టోయినిస్ (28: 14 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) నాలుగో బంతికి అవుటయ్యాడు. చివరి రెండు బంతులను జేసన్ హోల్డర్ (13: 4 బంతుల్లో) సిక్సర్లు కొట్టాడు.
అయితే చివరి ఓవర్లో టిమ్ సౌతీ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా... టిమ్ సౌతీ, శివం మావి, సునీల్ నరైన్‌లకు తలో వికెట్ దక్కింది.
View this post on Instagram