By: ABP Desam | Updated at : 31 Mar 2022 06:29 PM (IST)
Edited By: Ramakrishna Paladi
IPL 2022, Krunal Records: కృనాల్‌తో పెట్టుకుంటే CSK మిడిలార్డర్ బ్రూటలైపోద్ది!
Kurnal Pandya Records against CSK: ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL 2022) నేడు 'సూపర్' జట్లు తలపడుతున్నాయి! డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో (Chennai Superkings) లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants) ఆడనుంది. ఈ సీజన్ తొలి మ్యాచులో వీరిద్దరికీ ఓటమి ఎదురైంది. దాంతో రెండో మ్యాచులో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. కాగా సీఎస్‌కేపై (CSK) కేఎల్ రాహుల్ (KL Rahul) తన ట్రంప్‌కార్డుగా కృనాల్ పాండ్యను (Krunal Pandya) వినియోగించనున్నాడు. ఎందుకంటే అతడి బౌలింగ్‌లో సీఎస్‌కే మిడిలార్డర్‌కు అంత మెరుగైన రికార్డు లేదు.
టీ20ల్లో చెన్నై సూపర్‌కింగ్స్ మీద కృనాల్ పాండ్యకు మెరుగైన రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌లో రాబిన్ ఉతప్ప 33 బంతులాడి 37 పరుగులే చేశాడు. రెండుసార్లు ఔటయ్యాడు. ఇక అంబటి రాయుడు (Ambati Rayudu) 25 బంతుల్లో 28 చేసి రెండుసార్లు వికెట్ ఇచ్చుకున్నాడు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 15 బంతుల్లో 15 పరుగులు చేసి రెండుసార్లు పెవిలియన్ చేరాడు. ఇక ధోనీ (MS Dhoni) 17 బంతుల్లో 24 చేశాడు.
మరోవైపు కేఎల్ రాహుల్‌ను (KL Rahul) అడ్డుకొనేందుకు చెన్నై సూపర్ కింగ్స్ భారీగా వ్యూహాలు పన్నాల్సి ఉంది. అయితే మొయిన్ అలీకి క్వింటన్ డికాక్‌పై చక్కని రికార్డు ఉంది. మొయిన్ బౌలింగ్‌లో ఎనిమిది మ్యాచుల్లో 38 బంతుల్లోనే 53 పరుగులు చేసినప్పటికీ నాలుగు సార్లు ఔటయ్యాడు.
KL Rahul పై ఒత్తిడి!
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) విజయం సాధించాలంటే టాప్ ఆర్డర్ కచ్చితంగా ఆడాల్సిందే. గుజరాత్ పేసర్ షమి బౌలింగ్‌కు రాహుల్ సేన విలవిల్లాడింది. కేఎల్, డికాక్ (Quinton Decock), పాండేను (Manish Panday) ఔట్ చేయడంతో స్కోరులో వెనకబడింది. ఈ మ్యాచులో మాత్రం టాప్ ఆర్డర్లో కనీసం ఇద్దరు రాణిస్తేనే మంచింది. కెప్టెన్ రాహుల్‌పై కాస్త ఒత్తిడి ఉంది. మిడిలార్డర్‌లో దీపక్ హుడా (Deepak Hooda), ఆయుష్ బదోనీ (Aayush Badoni) హాఫ్ సెంచరీలు చేయడం, కృనాల్ (Krunal Pandya) బౌండరీలు బాదడం ప్లస్ పాయింట్. హోల్డర్, స్టాయినిస్, ఆండ్రూ టై వస్తే ఈ జట్టు భీకరంగా మారుతుంది. బౌలింగ్‌లో లక్నో ఫర్వాలేదు. దుష్మంత చమీరా చక్కని పేస్ జనరేట్ చేస్తున్నాడు. అవేశ్ ఖాన్ (Avesh Khan) ఫర్వాలేదు. కృనాల్ పరుగుల్ని నియంత్రించాడు. బిష్ణోయ్‌కు (Ravi Bishnoi) కలిసి రాలేదు. బౌలర్లను ఉపయోగించుకోవడంలో రాహుల్ ఇంకా పరిణతి కనబరచాలి. దీపక్ హుడాకు డెత్‌లో బౌలింగ్ ఇవ్వడంతో ఒక ఓవర్లో ఎక్కువ పరుగులు వచ్చాయి. దాంతో మ్యాచ్ గమనం మారిపోయింది. బాగా వేస్తున్న చమీరాకు 3 ఓవర్లే ఇవ్వడం ఆశ్చర్యం.
Rob-in the Zone!😍#Yellove #WhistlePodu 🦁💛 @robbieuthappa pic.twitter.com/y8ugC8n2Nh
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2022
Gearing up towards the Giants Clash!
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2022
📹 Coach's purview of #LSGvCSK! #WhistlePodu #Yellove 🦁💛 @amazonpay pic.twitter.com/xGvHhzLXIX
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్!
MI vs SRH, 1 Innings Highlights: ఫైనల్ ఆడినట్టుగా చితక్కొట్టిన సన్‌రైజర్స్ - ముంబయికి భారీ టార్గెట్!
MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Tilak Varma: ట్విటర్లో తిలక్ వర్మ ట్రెండింగ్- సన్నీ గావస్కర్ సెన్సేషనల్ కామెంట్స్
TRS Rajyasabha Candidates: రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్, ఆ ముగ్గురు వీరే
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ